ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఆదేశాలు మేరకు ఎంపీడీవో కి వినతి పత్రం అందిస్తున్న తెలుగుదేశం నాయకులు.
నారద వర్తమాన సమాచారం జి కొండూరు ప్రతినిధి.
మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాదు ఆదేశాల మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి ఎంపీడీవో కి పేదలకు పింఛన్లు పంపిణీ గురించి వినతిపత్రం అందజేశారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నేరుగా నగదు పంపిణీ చేసే కార్యక్రమాల నుండి వాలంటీర్ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. వారికి ప్రభుత్వం అందించిన సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయనున్నట్లు ఆదేశాలిచ్చారు. ఆ పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దనే పంపిణీ చేయాలి. రాష్ట్రంలో ఉన్న సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శుల సేవలను వినియోగించుకుని లబ్దిదారులకు ఇళ్ల వద్దనే అందించాలని కోరుచున్నాం.’ అంటూ వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామినేని రాజశేఖర్ (రాజా), మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబు , టీడీపీ నాయకులు వేముల శ్రీను , కె.నరసింహస్వామి. బొకినాల బెనర్జీ , మడుపల్లి ఆనంద్ , పచ్చిగోళ్ల ఇజ్రాయేల్ , జి.పిచ్చేశ్వరావు , గోగుల శ్రీను గారు, బొకినాల బెనర్జీ , వెలగపూడి రామకృష్ణ . బొంతా గంగరాజు , తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.