



నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
కార్మికులకు అండగా జై భీమ్ భారత్ పార్టీ నిలుస్తుంది
వివిధ దుకాణాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని వారికి భద్రత కల్పిస్తూ అండగా ఉంటామని జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ హామీ ఇచ్చారు. *మంగళవారం మధ్యాహ్నం పట్టణంలో వివిధ దుకాణాల్లో పనిచేసే కార్మికులతో ఆయన మాట్లాడారు. ఆదివారాలు, పండుగలు అని లేకుండా దుకాణాల యజమానులు వారి చేత వెట్టి చాకిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా కార్మికశాఖ నుంచి చాలామందికి గుర్తింపు కార్డులు లేకపోవటంతో వారికి ప్రభుత్వ రుణాలు, రాయితీలు, సంక్షేమ ఫలాలు తదితర అందటంలేదన్నారు. వెంటనే కార్మికశాఖ అధికారులు స్పందించిన సెలవులు విధిగా అమలు అయ్యేలా చూడాలని ఆయన సూచించారు. కార్మికులకు ఎల్లవేళలా పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్, నేను అండగా ఉంటామని చెప్పారు.
*సైకిళ్లు, ద్విచక్ర వాహనం, మోటర్లు రిపేరు చేసిన జొన్నలగడ్డ*
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పట్టణంలో జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ వివిధ దుకాణాల్లో కార్మికులతో మాట్లాడారు. వారి సమస్యలు.. ఇబ్బందులు, ప్రభుత్వ ప్రోత్సాహం తదితర వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. మీకు పార్టీ నేను అండగా ఉంటామని. భరోసా ఇచ్చారు.అనంతరం సైకిళ్లు…, ద్విచక్ర వాహనం, ఫ్యాన్, కూలర్ల మోటార్లు తదితర వాటిని బాగుచేశారు. ఈ సందర్భంగా ఆయా పరికరాలు బాగు చేస్తుండడంతో చాపరులు ఆసక్తిగా తిలకించారు. ఆయన వెంట మహంకాళి వెంకట్రావ్, దాసరి వెంకటేశ్వర్లు, దుగ్గి విజయ్ కుమార్, బొక్క భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.