273 గ్రాముల ఆల్ప్రజోలం, మిక్స్డ్ పౌడర్ స్వాధీనం
కలుషిత కల్లునునిందితుల అరెస్ట్..
కలుషిత కల్లు తయారుచేసిన నిషేధిత మత్తు పదార్థాలు గంజాయి సరఫరా చేసిన అమ్మిన కొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
డీఎస్పీ సత్యనారాయణ
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి: ఏప్రిల్ 12,
నిషేధిత మత్తు పదార్థములు కలిగి వుండి వాటి ద్వారా ప్రజల ప్రాణాలకు హాని కలుగ జేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు – డిఎస్పీ బాన్స్వాడ వెల్లడి విశ్వసనీయ సమాచారం మేరకు బిచ్కుంద ఎస్సై మరియు సిబ్బందితో కలిసి పెద్ద దేవాడ గ్రామానికి వెళ్లి అక్కడ ముత్యాలవార్ గంగ గౌడ్ @ సతీష్ గౌడ్ S/o దేవా గౌడ్, వయస్సు: 38 సంవత్సరాలు, వృత్తి వ్యాపారం, కులం:లింగాయత్, బిచ్కుంద మండలం పెద్ద దేవాడ గ్రామనికి చెందిన కల్లు కాంపౌండ్ లో తనిఖీ చేయగా 240 గ్రాముల ఆల్ఫ్రజోలం మిక్స్డ్ పౌడర్ దొరికింది.
అదేవిధంగా పిట్లం ఎస్సై మరియు సిబ్బందితో కలిసి బొల్లపల్లి గ్రామానికి వెళ్లి బైరి హన్మగౌడ్ S/o బలగౌడ్ వయస్సు: 45 సంవత్సరాలు, Occ: వ్యాపారం, కులం: గౌడ్, అతని కల్లు కాంపౌండ్ లో తనిఖీ చేయగా 10 గ్రాముల ఆల్ఫ్రజోలం మరియు 33 గ్రాముల గంజాయి దొరికింది హన్మగౌడ్ విచారించగ మా బంధువు దగ్గర ఆల్ఫ్రజోలం తీసుకున్నానని అతను మంబోజి గ్రామానికి చెందిన వ్యక్తి అని చప్పగా మెదక్ జిల్లా లోని మంబోజి గ్రామానికి వెళ్లి గౌండ్ల శివకుమార్ S/o గౌండ్ల అంజయ్య, వయస్సు: 37 సంవత్సరాలు, కులం: గౌడ్స్,వృత్తి కల్లు వ్యాపారం తనిఖీ చేయగా 23 గ్రాముల ఆల్ఫ్రజోలం దొరికింది.
నిషేదిత ఆల్ఫ్రజోలం మిక్స్డ్ పౌడర్ మరియు గంజాయి ద్వారా ప్రజల ప్రాణాలకు హాని కలుగ జేస్తున్న ముత్యాలవార్ గంగ గౌడ్ @ సతీష్ గౌడ్ S/o దేవా గౌడ్, బైరి హన్మగౌడ్ S/o బలగౌడ్ మరియు గౌండ్ల శివకుమార్ S/o గౌండ్ల అంజయ్య ను అరెస్ట్ చేయడం జరిగింది.ఇట్టి కేసులలో ఒక బైకును, మూడు మొబైల్ ఫోన్లను, ఒక వేయింగ్ మిషన్ లను స్వాధీన పరచుకున్నారు. బాన్స్వాడ డి.ఎస్.పి మాట్లాడుతూ ఇకపై ఎవరైన ఇలాంటి ప్రజల ప్రాణాలకు హాని కలిగించే దానితో కలుషిత కల్లును తయారు చేసిన మరియు నీషేదిత మత్తు పదార్థాలు మరియు గంజాయి సరఫరాచేసిన, అమ్మిన, కొన్న, వాడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోబడును అని సత్యానారాయణ డిఎస్‌పి అన్నారు.ఇట్టి కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడి పట్టుకున్న బిచ్కుంద,పిట్లం ఎస్సైలను, సిఐలు బిచ్కుంద, బాన్స్ వాడ రూరల్ గార్లను, టాస్క్ ఫోరస్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, బిచ్కుంద, పిట్లం & మరియు టాస్క్ ఫోరస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సింధు శర్మ, అభినందించడం జరిగిందిఅని తెలిపినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.