బిఎల్ పి,బిఎల్ ఎఫ్, ఆద్వర్యంలో, మహా త్మా జ్యోతి రావు పూలే,197,వ జయంతి…
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి:ఏప్రిల్ 12,
కామారెడ్డి జిల్లా కేంద్రం లో మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న మహాత్మా జ్యోతి రావు పూలే,197,వ జయంతి సందర్భంగా బిఎల్ పి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బిఎల్ ఎఫ్, రాష్ట్ర నాయకులు సిరిగాద సిద్దిరాములు, మహా త్మా జ్యోతి రావు పూలే గారికి పూల దండా వేశారు,
అనంతరం బిఎల్ పి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బిఎల్ ఎఫ్, రాష్ట్ర నాయకులు, సిరిగాద సిద్దిరాములు మాట్లాడుతూ…
మహాత్మా జ్యోతి రావు పూలే అణగారిన వర్గాల కోసం, ముఖ్యంగా బహుజన వర్గం ప్రజల కోసం తమ జీవితం ను త్యాగం చేశారు,భారతదేశంలో పీష్వాల కాలం నాటి మూఢ విశ్వాసాలను, అహంకారపూరితమైన మత ఆచారాలను, మనుషుల మధ్య కులం పేరుతో, మతం పేరుతో సృష్టించిన వివక్షను వ్యతిరేకించి… భారతదేశం యావత్తు చదువుకొని, తల ఎత్తుకొని జీవించాలని… భవిష్యత్తు తరాలు ప్రపంచ పురోగమనములో ముందుండాలని ఆలోచించి, చదువుకు ప్రాధాన్యత ఇస్తూ అనేక పాఠశాలలు నిర్మించి, నాటి వరకు చదువుకు దూరం చేయబడ్డ ప్రజలందరినీ చదువుకోవాలని పిలుపునిచ్చి, మహిళలకు సైతం చదువుకునే హక్కు ఉన్నది అని పాఠశాలలో ప్రారంభించి, సంఘసంస్కర్తగా అనేక సేవలు అందించిన మహాత్ముడు జ్యోతిరావు పూలే …
కార్యక్రమం లో బిఎల్ ఎఫ్ బలపరిచిన బిఎల్ పి, పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి MP,అభ్యర్థి గా పోటీ చేస్తున్నా వడ్ల సాయి కృష్ణ, బహుజన లెప్ట్ మహిళల సంఘం, కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు, గంగ మణి, బిఎల్ టీయూ, జిల్లా నాయకులు, గంగాధర్, బిసి ,మరియు రజక సంఘం జిల్లా నాయకులు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు,
Discover more from
Subscribe to get the latest posts sent to your email.