అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలను, గోడ ప్రతులను ఆవిష్కరించిన కలెక్టర్
అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు పాటించాలి:కలెక్టర్ జితేష్ వి పాటిల్
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి:ఏప్రిల్ 13,
అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శనివారం కామారెడ్డి విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలను, గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గోదాములలో, షాపింగ్ మాల్ లో ప్రమాదాలు జరగకుండా యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు వారం రోజులపాటు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను అగ్నిమాపక శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక కేంద్రం అధికారి సయ్యద్ మహమ్మద్ అలీ, లీడింగ్ ఫైర్ మేన్లు రవీందర్ రెడ్డి, లక్ష్మణ్, ఆపరేటర్లు సాయిబాబా, నరేందర్ రావు, ఫైర్ మేన్లు డి. స్టాలిన్, వై. శ్రావణ్, బి. రమేష్, జలంధర్, వెంకటి, దేవరాజు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.