నారద వర్తమాన సమాచారం
బాలికల భవితకు కొరకు కిషోరి వికాస పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఐ.ఏ.ఎస్.
యుక్త వయస్సు బాలికల కొరకు వేసవి శిక్షణా కార్యక్రమం..
కిషోరి వికాసంపై పోస్టర్ ను విడుదల చేసిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు
నరసరావుపేట:-
యుక్తవయస్సులో ఉన్న బాలికలు, మహిళల ఉజ్వల భవిష్యత్ కు కిషోరి వికాసం కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పేర్కొన్నారు. కౌమార బాలికల సాధికారిత లక్ష్యంగా జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన కిషోరీ వికాశంపై గోడపత్రికను స్ధానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆవిష్కరించారు. ఈనెల 2వ తేదీ నుంచి జూన్ 10 వరకు వివిధ శిక్షణా కార్యక్రమాలను యుక్తవయస్సు బాలికలకు అందిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో ఈ ప్రత్యేక సమ్మర్ క్యాంపెయిన్ గ్రామ, వార్డు స్థాయిలో కిశోరీ బాలికల సాధికారత కొరకు ఆరు అంశాలను చర్చిస్తూ ముందుకు సాగే విధంగా పుస్తకాలను రూపొందించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా యుక్తవయస్సు బాలికలకు విద్య ప్రాముఖ్యత, సంపూర్ణ ఆరోగ్యం, రుతుపరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, ఉన్నత విద్య, కెరీర్ మార్గదర్శనం, రక్షణ అంశాలు, బాల్య వివాహాల వలన కలిగే దుష్ప్రభావాలు, సైబర్ భద్రత, పోక్సో చట్టం వంటి అంశాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బాలల సంరక్షణ కు అవసరం అయిన టోల్ ఫ్రీ నెంబర్ చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సేవల వినియోగం, స్వీయ రక్షణ, ఆర్ధిక నిర్వహణ, నాయకత్వం, నిర్ణయాధికారం, లింగ వివక్ష, పునరుత్పత్తి ఆరోగ్యం, శారీరక వ్యాయామం, యోగా వంటి పలు అంశాలపై వారికి వేసవి సెలవులలో అంగన్వాడీ,సచివాలయ కేంద్ర పరిధిలో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
గ్రామ/వార్డు స్థాయి వనరుల బృందం, అంటే మహిళా పోలీసు, అంగన్వాడీ కార్యకర్త, ఏ.ఎన్.ఎం, వి.ఓ నాయకురాలు/సభ్యురాలు, సి.ఆర్పి లేదా విద్యా కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన క్యాలెండర్ ప్రకారం నిర్దేశిత బోధన ఆయా అంశాల మీద సంబంధిత రిసోర్స్ పర్సన్ ద్వారా అవగాహనా తరగతులు (గ్రూపు చర్చలు) నిర్వహిస్తారన్నారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు తమ నియంత్రణలో పని చేసే ఫీల్డ్ స్థాయి సిబ్బందికి అవసరమైన సూచనలు జారీ చేయాలన్నారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ, వార్డు స్థాయి బాలల సంక్షేమ, సంరక్షణ కమిటీ సమావేశాలు అన్ని సచివాలయాల్లో తప్పనిసరిగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి మహిళా పోలీసులు సదరు కమిటి కి మెంబర్ కన్వీనర్ గా ప్రధాన భూమిక పోషిస్తారని తెలిపారు. ప్రతిరోజూ నిర్వహించే కార్యక్రమాలను ఈసాధన పోర్టల్ లో అప్లోడ్ చేయాలి, ఈ వేసవి కార్యక్రమం మొత్తం విజ్ఞానవంతం గా,ఆనందోత్సాహంగా ఉండాలని దీనిలో ప్రతీ కిశోర బాలిక పాల్గొనేలా చూడాలనీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.