సహకార సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి: ఏప్రిల్ 13,
నస్రుల్లాబాద్, మిర్జాపూర్ సహకార సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రాలను శనివారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ పరిశీలించారు. సీఈవోలు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్, రైతులతో చర్చించారు. బీర్కూర్ మండలానికి చెందిన కొంతమంది పెద్ద రైతులు 3 నుంచి 30 ఎకరాల వరకు వ్యవసాయ భూమిలో ధాన్యం పండించిన రైతులు జీకే విత్తనాన్ని సాగు చేశారు. రైతులు బహిరంగ మార్కెట్లో ఎంఎస్పీ ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించినట్లు జెసికి చెప్పారు. మరి కొంతమంది రైతులు దాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎం ఎస్ పి ధరకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో వరి కొనుగోలు చేసే ప్రైవేట్ వ్యక్తుల నుంచి రైతులు సురక్షితంగా ఉండాలని సూచించారు. మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో ధాన్యానికి ఎక్కువ ధర వస్తే విక్రయించుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో డిసిఎస్ఓ మల్లికార్జున బాబు, సీఈవోలు, అధికారులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.