Friday, December 27, 2024

దార్శనికుడు అంబేద్కర్.. అంబేద్కర్ స్ఫూర్తితోనే జగనన్న పరిపాలన: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి

దార్శనికుడు అంబేద్కర్.. అంబేద్కర్ స్ఫూర్తితోనే జగనన్న పరిపాలన: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
క్రోసూరులో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతి

సామాజిక సమానత్వ సాధకుడు, దేశ దార్శనికుడు మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు  అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని క్రోసూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  నంబూరు శంకరరావు  మాట్లాడుతూ.. అంబేద్కర్  ఎంతో దార్శనికతతో అణగారిన వర్గాలకు రాజ్యాధికారం కోసం కృషి చేశారన్నారు. ఆయన స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారన్నారు. దళిత, బహుజన, బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని నలుదిక్కులా చాటిచెప్పేలా ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ప్రతిష్టించారన్నారు.  విద్య ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని చాటిచెప్పిన అంబేద్కర్ సిద్ధాంత సాధనలో భాగంగా విద్యారంగాన్ని సంస్కరణల బాట పట్టించారని వివరించారు. చదువు “కొన “లేని వారికి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యను చేరువ చేశారని వివరించారు. నియోజకవర్గంలోనూ దళిత, బడుగు, బలహీన, వర్గాలకు రాజకీయ ప్రాధాన్యతను ఇచ్చామన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version