నారద వర్తమాన సమాచారం
రాజ్యాంగంలో అందరికీ సమానత్వంలో కల్పించిన మహనీయుడు – డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్.. ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్
భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్
ఈ సందర్భంగ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ….
ప్రపంచ దేశాలలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగ నిర్మాత అయిన “డా. బి ఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
డా. బి ఆర్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14 న మహారాష్ట్రలోని మౌ్వో గ్రామంలో తక్కువ వర్గానికి చెందిన కుటుంబంలో జన్మించి, బాల్యంలో అనేక వివక్షలను ఎదుర్కొంటూ ఉన్నత విద్యను పొందారు.
సమానత్వం, మానవ హక్కులు, విద్యా స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన కృషి అనర్వచనీయమైనది.
వ్యక్తి లో ప్రతిభ ఉంటే అందరిలోను గుర్తింపు వస్తుంది అనడానికి నిదర్శనమే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని, ఆయన అనేకమైనటువంటి విద్యలలో ప్రావీణ్యతను సంపాదించిన మహనీయుడు తెలిపారు.
కొలంబియా విశ్వవిద్యాలయం మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నందు డాక్టర్ పట్టాలు పొందారన్నారు. అప్పటి కాలంలో అత్యున్నత విద్యను అభ్యసించిన అతి కొద్ది భారతీయులలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒకరిని తెలిపారు.
“బహుజన హితాయ్, బహుజన సుఖాయ్” అనే తత్వంతో ఆయన బహుళ సంస్కరణలను అమలు చేశారు” అని అన్నారు.
న్యాయవాదిగా ఆర్థికవేత్తగా రాజకీయవేత్తగా రాజ్యాంగ నిర్మాతగా అన్నిటికి మించి సామాజిక సంస్కర్తగా ఆయన పేరు చిరస్మరణీయం అని తెలిపారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయాలు మనకు మార్గదర్శిగా నిలవాలి. సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి అని, పోలీస్ సిబ్బంది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు రాజ్యాంగ స్ఫూర్తితో ఉద్యోగ నిర్వహణ చేయాలని జిల్లా ఎస్పీ తెలియ చేసినారు
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ తో పాటు,అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ JV సంతోష్ అడ్మిన్ ఆర్.ఐ రాజా , వెల్ఫేర్ ఆర్.ఐ. L. గోపీనాథ్ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.