నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
కనబడితే చాలు కన్నా కండువా వేస్తున్నాడు
వైయస్సార్సీపీ కండువా కప్పుకొని పవిత్రులయ్యాం
వైకాపా గూటికి చేరిన దమ్మాలపాడు ముస్లిం సోదరులు
ప్రచారం కోసమే కన్నా కండువాల కార్యక్రమం
రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు
సత్తెనపల్లి
దారిని పోయే వాళ్లందరికీ, వారి సమ్మతి లేకపోయినా కండువాలు కప్పి , కన్నా శిబిరంలో ఏదో జరుగుతుందని, తెలుగుదేశం పార్టీలో చేరికలు ఎక్కువవుతున్నాయనే ఆర్భాటపు ప్రచారం కోసమే కన్నా కనిపించిన వాళ్లందరికీ పచ్చ కండువా కప్పుతున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు అంబటి రాంబాబు విమర్శించారు.
సోమవారం నియోజవర్గ కార్యాలయంలో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు . ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడు గ్రామానికి చెందిన మహబూబ్ సుభాని , నాగుల్ మీరా , హసన్ భాషలు మొదటినుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. అయితే స్థానిక తెదేపా నాయకులు ఒత్తిడి చేసి తెలుగుదేశం పార్టీ లో చేర్పించారు. ఆదివారం కన్నా సమక్షంలో పచ్చ కండువాలు వేసుకున్నారు. అయితే పచ్చ కండువా వేసుకున్న తర్వాత వారికి నిద్ర పట్టలేదని, మనసులో ఏదో అసంతృప్తిగా ఉందని సదరు కార్యకర్తలు దమ్మాలపాడులోని వైయస్సార్సీపి నాయకులను సంప్రదించారు. తిరిగి వైసీపీలోనే కొనసాగుతామని కండువాలు వేయమని కోరారు. వారిని మంత్రి అంబటి సమక్షంలోకి తీసుకురాగా మీరు మన పార్టీ వారే కదా మీకు కండువాలు ఎందుకని ఆయన ప్రశ్నించగా… లేదండి పచ్చ కండవా కప్పుకొని అపవిత్రులమయ్యాము , మళ్లీ మన పార్టీ జగనన్న కండువా వేసుకొని పవిత్రులం కావాలని కోరుకుంటున్నాం అన్నారు. ఆయన సంతోషంతో వైయస్సార్ సిపి కండువాలను కప్పి తిరిగి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వారికి అభినందనలు తెలియజేసి మొహమాటానికి ఎక్కడికి పోవద్దని , హృదయపూర్వకంగా పార్టీకి కష్టపడి పని చేయాలని ఆయన హితావు పలికారు. కార్యక్రమంలో సత్తెనపల్లి ఎఎంసి వైస్ చైర్మన్ కళ్ళం శివరామిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ నాగూర్ మీరాన్ ,స్థానిక నాయకుల సుధాకర్ రెడ్డి, బుడే ,మాదల నాయకుల సైదా , బాజీ తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.