నారద వర్తమాన సమాచారం
వైయస్సార్ సీపీలో చేరిన బిజెపి నేత ఎస్ఎంఎ గపూర్
పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన మంత్రి అంబటి
సత్తెనపల్లి
భారతీయ జనతా పార్టీ (బిజెపి) మైనార్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎంఎ గపూర్ వైఎస్సార్ సీపీలో చేరారు. బుధవారం నియోజవర్గ కార్యాలయంలో ఆయనకు రాష్ట్ర జలవనరుల శాఖా మాత్యులు, నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థి అంబటి రాంబాబు పార్టీ కండవ కప్పి సాదరంగా ఆహ్వానించి అభినందనలు తెలియజేశారు. కూటమి నుంచి రాష్ట్రస్థాయి హోదా కలిగిన నాయకులు ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీలో చేరటం శుభపరిణామన్నారు. మీ సేవలనుసద్విని యొగించుకుంటామన్నారు. సముచిత స్థానం, గౌరవం అందిస్తామన్నాచ్చారు. నియోజకవర్గంలో ముస్లింలకు వైఎస్ఆర్సిపి అండగా ఉంటుందని, వారి అభివృద్ధికి విశేషంగా తోడ్పాటు అందించామన్నారు. మైనారిటీలను మరింత బలోపేతం చేసి పార్టీ విజయవంటానికి కృషి చేయాలని గపూర్ కు అంబటి చూయించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వైయస్సార్సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు ఉన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.