కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ గా గడ్డం ఇందు ప్రియా ఎన్నిక
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి:ఏప్రిల్ 15,
కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ మరియు కౌన్సిలర్ లు మర్యాద పూర్వకంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ని కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ..
మున్సిపాలిటీలో 50 మంది ఓటింగ్ కు 29 ఓట్లు వచ్చాయి
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో చైర్మన్ గా గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా త్వరలోనే ఉరుదొండ వనిత ఎంపిక అవుతారు.
నాలుగేళ్ళ 3 నెలల అవినీతి పాలనకు చరమగీతం పాడాం
మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి పెడతాం.త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో కామారెడ్డి మున్సిపాలిటీ కౌన్సిలర్లతో కలిసి సమావేశమవుతాం
రాబోయే 8 నెలల్లో బెస్ట్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
మున్సిపాలిటీలో ప్రజలకు సరిపడా నీళ్లు రావడం లేదు
ఎన్నికల తర్వాత సీఎం సమక్షంలో మిషన్ భగీరథ అధికారులతో సమావేశం నిర్వహించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం.ఇందిరాగాంధీ స్టేడియంలో 24 గంటల లైటింగ్ సౌకర్యం కల్పించి జాతీయ స్థాయి స్టేడియంకు కావాల్సిన వసతులు కల్పిస్తాం
పట్టణంలో తాను చదువుకున్న ప్రభుత్వ బాలుర పాఠశాల కూలిపోయే స్థితిలో ఉంది.
2-3 కోట్ల వ్యయంతో నూతన పాఠశాల నిర్మాణం చేపడతాం
పాఠశాలకు కావాల్సిన ఇతర వసతులు సొంత డబ్బుతో ఏర్పాటు చేస్తా,కామారెడ్డిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.నూతన రైల్వే బ్రిడ్జిను ఏర్పాటుకు శ్రీకారం చుడతాం.రైల్వే అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్తాం.10 వేల కోట్ల మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుతో చేతిలో చిప్ప పెట్టిన కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇప్పటికే 5 గ్యారెంటీలు పూర్తి చేసాం.90 రోజుల్లో 31 వేల ఉద్యోగాలిచ్చి చరిత్రలో నిలిచాం.ఎన్నికల కోడ్ తర్వాత మరొక 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.ఏడాదిలో లక్ష ఉద్యోగాలు ఇవ్వడమే టార్గెట్
బీఆర్ఎస్ నాయకులు సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతున్నారు.
ఆకాశంపై ఉమ్మితే మనపైనే పడుతుందని మర్చిపోతున్నారు.
10 సంవత్సరాల్లో బిబిపాటిల్ కేంద్రం నుంచి గాని, రాష్ట్రం నుంచి గాని పైసా పని చేయలేదు.పార్లమెంట్ పరిధిలో ఒక్క మండలం పేరు కూడా ఆయనకు తెలుసా
పార్లమెంటులో ఇక్కడి సమస్యలపై ఒక్కసారి కూడా మాట్లాడలేదు.
కనీసం రైల్వే బ్రిడ్జి కూడా మంజూరు తేలేకపోయారు
ఇప్పటిదాకా రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ కుటుంబ పాలన జరిగింది.
ప్రస్తుతం ప్రజా పాలన నడుస్తోంది.
నాడు పిసిసి హోదాలో ఫోన్ ట్యాపింగ్ పై చెప్పిన మాటలు నేడు నిజమని తేలాయి
కేంద్రం అనుమతి లేకుండా ట్యాపింగ్ చేసి నాయకులు, భార్యాభర్తల మాటలు విన్నారు.నాకున్న సమాచారం ప్రకారం త్వరలో కేసీఆర్ కుటుంబం జైలుకు పోయే అవకాశం
మోడీ ఝూటా మాటలు.. ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పారు.
రాహుల్ గాంధీ ప్రధాని అయితే రాష్ట్రానికి మేలు దేశంలో ఇండియా కూటమిని గెలిపించుకుంటాం అన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.