Friday, November 22, 2024

యువ పారిశ్రామికవేత్తలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం: ప్రత్తిపాటి

నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి

యువ పారిశ్రామికవేత్తలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం: ప్రత్తిపాటి

పురుషోత్తపట్నంలో సూపర్ సిక్స్ పథకాలపై ప్రత్తిపాటి, లావు ప్రచారం

ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తల కోసం రూ. 10 లక్షల ఆర్థికసాయం అందించే కొత్త పథకాన్ని తీసుకురానున్న వెల్లడించారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. రాష్ట్రంలోని యువతను ఔత్సాహి క పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు, పవన్ ఎంతో ఆలోచించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సోమవారం చిలకలూరిపేట పురుషోత్తపట్నంలో ఎన్నికల శంఖారావం, సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారంలో ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. ముందుగా ప్రత్తిపాటి, లావుకు తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. వారిద్దరు ట్రాక్టర్లు నడిపి శ్రేణులను ఉత్సాహపరిచారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగానే సూపర్‌ సిక్స్‌ పథకాలతో పాటు యువత కోసం చంద్రబాబు, పవన్ రూపొందించిన రూ. 10లక్షల ఆర్థిక సాయం పథకం గురించి తెలిపారు. దీనిద్వారా యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారిగా కాక ఉద్యోగాలిచ్చే స్థితిలో నిలుస్తారని ఆశాభావం వ్యక్యం చేశారు. ఇందుకు విరుద్ధమైన రీతిలో నాసిరకం మద్యంతో ఏడాదికి రూ.30 వేల కోట్లు దోపిడీ చేసి జగన్ రాష్ట్ర భవిష్యత్‌నే ప్రశ్నార్థకం చేశారని వాపోయారు ప్రత్తిపాటి. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి దానిన కొనసాగి స్తామని స్పష్టమైన హామీతో పాటు వారి గౌరవవేతనం రూ.10వేలు చేస్తామని చంద్రబాబు హా మీ ఇచ్చారన్నారు. ఆ విషయంలో వైకాపా మోసపూరిత మాటలు ఎవరూ నమ్మొద్దని కోరారు.
రాజధాని ఏది అంటే చెప్పలేని, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో హామీ ఇవ్వలేని వైకాపా, జగన్, అతడి మంత్రులు పోతేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్ అని స్పష్టం చేశారు ప్రత్తిపాటి. జగన్ రెడ్డి పాలన, బటన్ నొక్కుడు సంక్షేమమంతా బూటకమని అతడి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలం తా దగా పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్ముకున్న ఎంతోమందిని బయటకు పంపించిన స్వార్థపరుడూ జగన్ అని దుయ్యబట్టారు. ఎంపీలు బాలశౌరి, మాగుంట శ్రీనివాసరెడ్డి సహా ఎంతోమంది జగన్‌రెడ్డి బాధితులే అన్నారు. నమ్మినబంటుగా ఉన్న జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ ఇక్బాల్ సహా ఎంతోమంది ఆ పార్టీలో జరుగుతున్న అవమానాలకు తట్టుకోలేక బయటకు వచ్చారన్నారు. అయిదేళ్లు అధికారం వెలగబెట్టి గుంటూరుకి పారిపోయిన మంత్రి రజి నీ తన సొంతూరు పురుషోత్తపట్నానికైనా ఏం చేశారో చెప్పాలన్నాురు. తాను గెలిస్తే ఆ ఊరికి
ఏం కావాలన్నా చేసి చూపిస్తానన్నారు. చంద్రబాబు, పవన్‌ను ఇష్టం వచ్చినట్లు దూషించిన వైకాపాకు ఈ ఊరిలో ఒక్క ఓటేసినా పవన్‌ను అవమానించినట్లు అవుతుందన్నారు ప్రత్తిపాటి. అనంతరం మాట్లాడిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి రజినితో సొంత గ్రామ ప్రజలు ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలను వదిలేసి వేరే నియోజకవర్గానికి పారిపోతే ఇక్కడి ప్రజలను ఎవరు పట్టించుకోవాలని అన్నారు. అన్ని నిజాలు తెలిసి, రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న పురుషోత్తపట్నం ప్రజలు వాటిని భరిస్తారా అన్నారు. మంత్రి రజినీ ఈ నియోజకవర్గంలో ఉన్నన్ని రోజులు కూడా సెక్యూరిటీ లేకుండా బయటకు వచ్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. కూటమి విజయంతో చిలకలూరి పేట నియోజవర్గంతో పాటు నర్సరావుపేట ఎంపీ స్థానం మొత్తంలో అభివృద్ధికి కొత్తబాటలు చూపిస్తామని ఆయన ఈ సందర్ఫంగా హామీ ఇచ్చారు.

పురుషోత్తపట్నం వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు

పురుషోత్తపట్నం వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి పెద్దఎత్తున చేరికలు జరిగాయి. వైసీపీ నాయకుడు, మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తోట లక్ష్మీనారాయణ, విడదల శంకర్రావు, దేవిరెడ్డి లక్ష్మీనారాయణతో పాటు మరో 100 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరాయి. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ప్రత్తిపాటి, లావు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version