నారద వర్తమాన సమాచారం
జూన్ :08
జగన్ ముఠా దోచుకున్న రూ. 8 లక్షల కోట్లు కక్కిస్తాం: ప్రత్తిపాటి
ఒక్కఛాన్స్ అంటూ వచ్చి అయిదేళ్లలో 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా దోచేసిన వైకాపా దోపిడీ మొత్తాన్ని తిరిగి కక్కిస్తామని స్పష్టం చేశారు మాజీమంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ల్యాండ్,శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, సహా అనేక రూపాల్లో జగన్ ముఠా ప్రజాధనాన్ని కొల్లగొట్టిందన్నారాయన. అందుకు సంబంధించి లెక్కలు తేల్చే పని కొత్తప్రభుత్వ కొలువుదీరగానే మొదలవుతుందని తెలిపారు. చిలకలూరిపేట నుంచి అద్భుత విజయం సాధించిన ప్రత్తిపాటికి శుక్రవారం కూడా ప్రజాభిమానం పోటెత్తింది. ఆయనకు అభినందనలు తెలపడానికి తరలివచ్చిన జనసందోహంతో చిలకలూరిపేటలోని ప్రత్తిపాటి నివాస ప్రాంగణం కిటకిటలాడింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందజేశారు. పూలమాలలు వేసి అభినందనలతో ముంచెత్తారు. మున్సిపల్ కమిషనర్ గోవిందరాజులు, డీఈ రమణ, ఏఈ శ్రీనివాసరావు, మెప్మా ఆర్పీలు, నాదెండ్ల, యడ్లపాడు పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు ప్రత్తిపాటిని మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడిన ప్రత్తిపాటి వైకాపా రూ. 8లక్షల దోపిడీపై ప్రతిపక్షం లోనే ఉండగానే పూర్తి వివరాలతో తెలుగుదేశం పార్టీ తరఫున ఛార్జ్‌షీట్ విడుదల చేశామని గుర్తు చేశారు. జే-బ్రాండ్స్ మద్యం కమీషన్ల రూపంలోనే లక్ష కోట్లకు పైగా దండుకున్నట్లు అనుమానాలు ఉన్నాయని, దానికి సంబంధించి నిగ్గుతేల్చే పని సీఐడీ ద్వారాఇప్పటికే ప్రారంభమైందన్నారు. దాని తర్వాత రూ. లక్ష కోట్ల విలువైన అసైన్డ్ భూముల కుంభకోణం ఉందని, దానిలో వైకాపా నేతల నుంచి కొంతమంది సీనియర్ అధికారుల పాత్రపైనా విచారణలు తప్పవన్నారు ప్రత్తిపాటి. జగన్ బినామీ సంస్థ ఇండోసోల్ కుంభోణం, విద్యుత్ ఒప్పందాలు, టీడీఆర్ బాండ్లలో గోల్‌మాల్ ద్వారా కూడా వేల కోట్లు దోచేశారని ఆయన ఆరోపించారు. విశాఖభూముల కుంభకోణం మరో రూ.40వేల కోట్ల వరకు లెక్క తేలుతోందన్నారు. వీటన్నింటిలో ప్రమేయం ఉన్న వైకాపా నాయకులు, అధికా రులు తప్పక చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటందన్నారు ప్రత్తిపాటి పుల్లారావు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.