Friday, November 22, 2024

విజ్ఞులైన పెద్దలకు నమస్కారములతో నేషనలిస్ట్ జనశక్తి పార్టీ (యన్ జె పి ) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కడియం సూరిబాబు విజ్ఞప్తి:

నారద వర్తమాన సమాచారం

విజ్ఞులైన పెద్దలకు నమస్కారములతో నేషనలిస్ట్ జనశక్తి పార్టీ (యన్ జె పి ) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కడియం సూరిబాబు విజ్ఞప్తి:

తేదీ 13-05-2024న మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంటుకు జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికలలో నేషనలిస్ట్ జనశక్తి పార్టీ (యన్ జె పి ) పోటీ చేయుచున్నది. ఎన్నికలంటే వందల, వేల కోట్ల రూపాయల ఖరీదైన వ్యవహారంగా మారిపోయి, ప్రజలు తమ స్వచ్ఛంద అభీష్టం మేరకు ఓటువేసి, ప్రజాస్వామ్యానికి అర్ధం తెలిపే పరిస్థితులు నేడు కాన రావడంలేదు. ధనాన్ని పంచి, రకరకాల ప్రలోభాలకు ఓటరుని గురిచేసి, ఓట్లు వేయించుకొని, ఆ తరువాత దానికి వందల రెట్లు దోచుకోవడమే నేడు ప్రజాస్వామ్యం ముసుగులో జరుగుతున్న వ్యాపారం. దీనిని నేషనలిస్ట్ జనశక్తి పార్టీ యన్ జె పి  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. నైతిక విలువలతో కూడిన రాజకీయాల ద్వారా అవినీతిరహిత సమాజ నిర్మాణం కోసం, ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు మా నేషనలిస్ట్ జనశక్తి పార్టీ (యన్ జె పి ) దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నది.

ఈ ఎన్నికలలో మా పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా యమ్ పి మరియు ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీకి నిలబడుచున్నారు. మా ప్రయత్నానికి విజ్ఞులైన తమరు నైతిక మద్దతు తెలియచేసి, విరాళ రూపంలో ఆర్థిక సహకారం అందించాలని, పార్టీ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు మీ వంతు సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఇచ్చే ప్రతీ రూపాయి విరాళానికి పారదర్శకంగా లెక్క చూపించగలమని తెలియచేస్తున్నాము.🙏
కడియం సూరిబాబు,
రాష్ట్ర అధ్యక్షుడు,
నేషనలిస్ట్ జనశక్తి పార్టీ, ఆంధ్రప్రదేశ్.
ఫోన్ నం .9866126889
అకౌంట్ నం 201013617908
ఇండస్ ఇండ్
ఐ యఫ్ యస్ సి (ఐయన్ డి బి 0001099 )
గూగుల్ పే
నం .9866126889


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version