Saturday, November 23, 2024

ఈనెల 25న నామినేషన్ ను జయప్రదం చేయండి : అంబటి పిలుపు

నారద వర్తమాన సమాచారం

సకల వర్గాల సంక్షేమం జగనన్నతోనే సాధ్యం

రాజుపాలెం మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి అంబటి

ఈనెల 25న నామినేషన్ ను జయప్రదం చేయండి : అంబటి పిలుపు

రాజుపాలెం

సమాజంలోని సకల జన సంక్షేమం జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యమని రాష్ట్ర జలవనరుల శాఖా మాత్యులు, నియోజకవర్గ వైయస్సార్ సిపి అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం రాజుపాలెం మండల కేంద్రంలో అంబటి రాంబాబు విస్తృతంగా పర్యటించారు. కీలక నేతలు అందరి నివాసాలకు వెళ్లి కలిశారు. వారి యోగక్షేమాలపై ఆరా తీశారు. మండల పార్టీ పరిస్థితి సమీక్షించారు. గత లోపాలను సవరించుకొని పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసేలా నాయకులను ప్రోత్సహించారు. నియోజవర్గంలో రాజుపాలెం మండలం కీలకంగా మారడంతో ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన, నియోజక వర్గ ద్విచక్ర వాహన యాత్రలు, నాయకుల ఐక్యతారగంతో కలిసి ముందుకురాటంతో వైఎస్ఆర్ సిపి తిరుగులేని శక్తిగా ఎదిగిందని నాయకులకు అంబటి వివరించారు. ప్రజలలో సంక్షేమ పథకాల పట్ల , జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల సానుభూతి ఉందని, ప్రభుత్వానికి విశేషమైన ఆదరణ లభిస్తుందని దాన్ని మనం ఓట్ల రూపంలో మార్చుకోవడానికి నాయకులు చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ నెల 25వ తేదీన నామినేషన్ వేస్తున్నానన్నారు. ఉదయం దేవవరంపాడు నేతి వెంకన్న స్వామి ఆలయంలో పూజల అనంతరం 9 గంటలకు ప్రచార వాహనంపై బయలుదేరి కొండమోడు, రాజుపాలెం మీదుగా సత్తెనపల్లి ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాయకులు జన సమీకరణ చేసి విజయవంతం చేయాలని ఆదేశించారు. నామినేషన్ తోనే విజయానికి తొలి అడుగుపడాలని కోరారు. గ్రామంలో ప్రతి వీధిలోను మహిళలు అంబటి ఎదురేగి స్వాగతం పలికారు. హారతులు ఇచ్చారు. ప్రతి ఇంటికి తీసుకెళ్లి అత్యంత ఆదరణ చూపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఏపూరి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సిపి అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు ఉన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version