నారద వర్తమాన సమాచారం
అంబరాన్నంటిన అంబటి నామినేషన్ సంబరం
సత్తెనపల్లి ని ముంచెత్తిన జన సునామి
నామినేషన్ సందర్భంగా సర్వమత ప్రార్థనలు.
దేవరంపాడు నుంచి ప్రత్యేక రథంపై ర్యాలీగా నామినేషన్ కి వచ్చిన అంబటి.
అడగడుగునా హారతులు ..గ్రామ గ్రామాన గజమాలతో అపూర్వ స్వాగతాలు.
ఈసారి కూడా మా పెద్దాయనే ఎమ్మెల్యే అంటూ ప్లకార్డుల ప్రదర్శనలు.
ఆఖరి రోజు నామినేషన్ దాఖలు చేసిన
రాష్ట్ర మంత్రి, వైఎస్ఆర్ సిపి అభ్యర్థి అంబటి రాంబాబు
నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఇతర ముఖ్య నేతలు
40 వేల మందికి పైగా హాజరైన వైఎస్సార్ సిపి జనవాహిని.
సత్తెనపల్లి
సత్తెనపల్లిని జన సునామీ ముంచెత్తింది. కొద్దిసేపు స్తంభించిపోయింది. జగన్నామ స్మరణ,జై అంబటి నినాదాలతో మార్మోగిపోయింది. గుండెలదిరెలా డిజేల మోతలు, రహదారులు కనిపించని రీతిలో జనాలు. అంబటి సైతం ఊహించిన రీతిలో జన ప్రభంజనం ఆయన నామినేషన్ కు తరలివచ్చింది. అపారమైన అభిమానంతో పల్లెలన్నీ కదిలి వచ్చాయి. కుటుంబ సమేతంగా వచ్చిన జనాన్ని చూసి జాతరలా పట్టణం మురిసిపోయింది. వైయస్సార్ సిపి అభ్యర్థిగా అంబటి రాంబాబు నామినేషన్ కార్యక్రమం దిగ్విజయమైంది.
సర్వమత ప్రార్ధనలతో ప్రారంభమై..
చివరి రోజు అంబటి నామినేషన్ దాఖలు చేసేందుకు ముందుగా ఆయన నివాసం వద్ద సతీమణి విజయలక్ష్మి హారతి ఇచ్చారు. పట్టణంలోని మసీదులో ముస్లిం సోదరుల తో కలిసి నమాజ్ చేసారు. ధూళిపాళ్ల భాగ్యనగర్ కాలనీలో అగాపే చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాజుపాలెం మండలం దేవరంపాడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక ప్రచార రథంపై ర్యాలీ సాగింది.
అటుగడుగునా హారతులు.. క్రేన్ తో గజమాలను
కొండమోడు వద్ద నుంచి సత్తెనపల్లి వరకు ప్రధాన రహదారిలోని ప్రతి గ్రామంలోనూ మంత్రి అంబటికి అపూర్వ స్వాగతం లభించింది. హారతులు తో మహిళలు బ్రహ్మరథం పట్టారు. చౌటపావా పాలెం, ధూళిపాళ్ల వద్ద క్రేన్ తో భారీ గజమాలలను అంబటి కి అలంకరించారు. రాజుపాలెంలో భారీగా తరలివచ్చిన జన సందోహం చూసి వారితో కలిసి అంబటి కొంత దూరం పాదయాత్ర చేశారు. ధూళిపాళ్లలో స్థానిక నాయకులు 108 గుమ్మడికాయలతో అంబటి కి దిష్టి తీయించారు. చెక్ పోస్ట్ వద్ద కేరళ రాష్ట్ర వస్త్ర ధారణతో చేసిన డ్రమ్స్ , తీన్మార్లతో డప్పుల వాయిద్యం, కోలాటాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ర్యాలీలో పాల్గొన్న పార్లమెంట్ అభ్యర్థి అనిల్
. మార్గమధ్యంలో యన్నదేవి వద్ద నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన రాకతో శ్రేణుల్లో నూతన ఉత్సాహం పెల్లుబికింది.జై అనిల్ అన్న జై జై అనిల్ అన్న , జై అంబటి అంటూ నినాదాలు మార్మోగిపోయాయి. అంబటికి అనిల్ శుభాకాంక్షలు తెలియజేశారు. పూర్వ శాసనసభ్యులు యర్రం వెంకటేశ్వర రెడ్డి, గుంటూరు ఏఎంసీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ ,రూరల్ పార్టీ అధ్యక్షులు రాయపాటి పురుషోత్తమరావు తో కలిసి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. 40 వేల మందికి పైగా హాజరైన వైయస్సార్ సిపి జనవాహినితో
అంబటి నామినేషన్ సంబరం సంబరాన్ని అంటింది.దిగ్విజయంగా ముగిసింది.
కార్యక్రమంలో పర్యావరణ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బా చంద్రశేఖర్, పూర్వ గ్రంథాలయాల సంస్థ చైర్మన్ చిట్ట విజయభాస్కర్ రెడ్డి , పల్నాడు జిల్లా వైద్య విభాగం అధ్యక్షులు గజ్జల నాగభూషణ్ రెడ్డి, డాక్టర్ గీత హసంతి, డైమండ్ బాబు నియోజకవర్గ నాయకులు , ప్రజాప్రతినిధులు, వైయస్సార్సీపి అనుబంధ సంఘాల బాద్యులు, క్రియాశీలక కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.