నారద వర్తమాన సమాచారం
“బొల్లా”కి జై కొట్టిన వినుకొండ.
బొల్లా నామినేషన్ కుపోటెత్తిన ప్రజలు..
మారుమోగిన “జై జగన్… జై…బొల్లా” నినాదం
వేలాది మంది అభిమానులతో భారీ ర్యాలీ..
నామినేషన్ దాఖాలు చేసిన బొల్లా
వినుకొండలో జన సునామి వచ్చింది..
ప్రజలు తరలివచ్చి శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు కి బ్రహ్మరథం పట్టారు...
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వినుకొండ నియోజకవర్గం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం నుండి వేలాది మంది తో భారీ ర్యాలీ ప్రారంభమైంయింది.
అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ర్యాలీ యువత కేరింతల నడుమ, వైసీపీ జెండాను రెపరెపలాడిస్తూ జూనియర్ కాలేజీ, శివయ్య స్తూపం సెంటర్, అరుణ థియేటర్ మీదుగా రిటర్నింగ్ అధికారి (తహసిల్దారు ) కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
శివయ్య స్తూపం సెంటర్లో అభిమానులు క్రేన్ ల సాయంతో పెద్ద సంఖ్యలో భారీ గజమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు , బొల్లా గిరిబాబు ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. అడుగడుగునా మహిళలు హారతులు పడుతూ అభిమాన నాయకుడిపై పూల వర్షం కురిపించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారావుకు నామినేషన్ పత్రాలు సమర్పించి అనంతరం మీడియాతో మాట్లాడిన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు జరగబోయే ఎన్నికల్లో గెలుపు తనదేనని, ప్రజల ఆశీస్సులతో రెండవసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. చెరువులో ఉన్న నీళ్లను మాయం చేసి లక్ష మంది ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూశారని,దేవుడే వారి కుట్రను భగ్నం చేసారన్నారు.
ఒక్క సారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలు మళ్ళీ గెలిపించాలని కోరారు.
అభివృద్ధిని కొనసాగించేందుకు ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరారు. అబద్దాలు,అసత్యలు చెప్తూ ప్రజలని మోసం చేయాలని, నన్ను ఓడించే లక్ష్యం తో కుట్రలు చేస్తున్న కూటమి నేతలకి బుద్ది చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఎంపి అభ్యర్థి గా పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ ని గెలిపించు కుంటేనే పల్నాడు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అభివృద్ధి, నవరత్నాలు పధకాలు అమలు కావాలంటే వైసీపీ అధికారం లోకి రావాలని, సీఎం గా జగనన్న ఉండాలని అన్నారు. వినుకొండ ప్రాంత ప్రజలకి ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తానని, వినుకొండ నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించి మాట నిలబెట్టు కుంటానని తెలిపారు.
కాగా భారీ ర్యాలీ కనీ వినీ ఎరుగని రితిలో విజవంతం కావటం బ్రహ్మనాయుడు కి భారీ మెజారిటీ ఖాయమని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు….
Discover more from
Subscribe to get the latest posts sent to your email.