మద్యం దుకాణాలు మరియు బార్లపై నిరంతర నిఘ
. ప్రొవిజన్ ,ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్
నారద వర్తమాన సమాచారం, నిజామాబాద్ జిల్లా ,
ఆర్మూర్,.
మద్యం షాపులలో యజమానులు ఎలాంటి అవకతవకల కు పాల్పడకుండా, మద్యాన్ని కల్తీ చేయకుండా నిరంతరం షాపులలో తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆర్మూర్ ప్రొవిజన్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్ తెలియజేశారు. రానున్న పార్లమెంటరీ ఎన్నికల దృష్ట్యా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం మన ప్రాంతానికి అక్రమంగా రాకుండా కట్టుదిట్టమైన భద్రత నడుమ నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. మద్యం దుకాణదారులు మరియు బార్ యజమానులు మద్యం కల్తీ చేస్తున్నట్లు తెలిస్తే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని, మద్యం కల్తీ చేయడం చట్టరీత్యా నేరమని, కల్తీ చేసిన వ్యక్తుల పైన చట్టరీత్యా కఠిన శిక్షలు తీసుకుంటామని వారు అన్నారు. మద్యం దుకాణ లైసెన్స్ దారులు టి.స్.బి. ఎల్ డిపో మాక్లూర్ నుండి మాత్రమే మద్యాన్ని కొనుగోలు చేయవలెనని ఇతర ప్రాంతాల నుండి మద్యాన్ని తీసుకుని సప్లై చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో వచ్చిన నుండి ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలు కేసుల సంఖ్య- 21 ,అరెస్టు అయిన వారి సంఖ్య- 14 ,పట్టించిన మద్యం ఐ .ఎం. ఎల్ -64 లీటర్లు ,పట్టుబడిన బీర్ -20 లీటర్లు, పట్టుబడిన సారాలు -17 లీటర్లు, ధ్వంసం చేయబడిన బెల్లం పసకం -1400 లీటర్లు, ధ్వంసం చేయబడిన కళ్ళు- 1000 లీటర్లు ,పట్టుబడిన వాహనాలు-4, గా నమోదయ్యాయని వారు తెలియజేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.