కాలుష్య కారక వ్యర్థాలను మట్టిలో కలుపుతున్న ఎజ్జోలో కంపెనీపై చర్యలు తీసుకోవాలి.
కాలుష్య కారక వ్యర్థాలను సేకరిస్తున్న పీసీబీ అధికారి సురేష్
నారద వర్తమాన సమాచారం:
భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
కాలుష్య కారక వ్యర్ధాలను కంపెనీలోని భూమిలో పారబోస్తున్నారన్న నేపథ్యంలో గురువారం స్థానిక రైతు పగిళ్ల లక్ష్మారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పిసిపి అధికారి సురేష్ దోతి గూడెం లోని హెడ్ జోలో పంపిణీ సందర్శించారు.
ఈ సందర్భంగా డిస్చార్జ్ కెమికల్ ని విడుదల చేసిన ప్రాంతాలలో నమూనాలను ఆయన సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేకరించినమానాలను ప్రయోగషాలకు పంపి తగిన ఆధారం సేకరించిన అనంతరం కంపెనీ పై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే స్థానిక రైతులు నాయకులు కంపెనీ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యర్థ రసాయనాలు భూమిలోకి వదులుతూ ఈ ప్రాంతాన్ని పూర్తిగా కాలుష్య మయంగా చేస్తున్న కంపెనీ గుర్తింపు రద్దుచేసి రైతులకు తగిన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలం మల్లేష్ యాదవ్, నాయకులు సత్యం, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.