Friday, November 22, 2024

చర్ల మండలం లో పెత్తనం మొత్తం దళారుల చేతిలోనే .పెద్దిపల్లి ఇసుక ర్యాంపు నిర్వాహకం.

నారద వర్తమాన సమాచారం

సొసైటీలను అడ్డుపెట్టుకొని అక్రమ ఇసుకవ్యాపారం నిర్వహిస్తున్న దళారులు

ఇసుక క్వారీలోకానరాని ఇసుక సొసైటీ సభ్యులు

ఇసుక దళారులు స్థానికులు కాకపోయినప్పటికీ రాంపు నిర్వహణలో అజమాయిషి

పెత్తనం మొత్తం దళారుల చేతిలోనే….. పెద్దిపల్లి ఇసుక ర్యాంపు నిర్వాహకం…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం పెద్దపల్లి ఇసుక ర్యాంపు నిర్వహణలో కానరాని ఇసుక సొసైటీ బృందం ఇసుక సొసైటీ అడ్డుపెట్టుకొని స్థానికులు కాకపోయినప్పటికీ సొసైటీ ద్వారా సేకరించిన ఇసుకను వారి ఇష్టాను రాజ్యంగా అమ్ముకుంటూ గుట్టలు గుట్టలుగా ఇసుకను పోగేసి ఇసుక సొసైటీ నిర్వహించే నియమ నిబంధనలను తుంగలో తొక్కి సమయం సందర్భం లేకుండా అక్రమంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు ఇసుక రాంప్ లోకి ఎవరిని అనుమతించకుండా వారి ప్రైవేట్ ముఠాలను కాపలాగా పెట్టుకుంటూ క్వారీలోకి పత్రిక విలేకరులను సైతం అడుగుపెట్టకుండా ఒకవేళ ఇసుక సొసైటీ నిర్వహణ పరిశీలనకు వివరణ కోసంవెళ్లిన విలేకరులను సైతం భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి సంబంధిత గ్రామ రెవెన్యూ తాసిల్దార్ ఆర్డీవో ఐటిడిఏ పిఓ అధికారులుచొరవ తీసుకొని పెద్దపల్లి ర్యాంపు నిర్వహణపై విచారణ చేపట్టి ఇసుక క్వారీ సజావుగా సాగే విధంగా స్థానికులు కానటువంటి ర్యాంపుతోసంబంధం లేని ఇసుక దళారులపై చర్యలుచేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version