నారద వర్తమాన సమాచారం
బీఆర్ఎస్ పాలనలో జోకర్ గాళ్లు, బ్రోకర్ గాళ్లెక్కువ…
సిద్దిపేట: పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా చేర్యాల పట్టణంలో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి మద్దతుగా కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ మసమావేశంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో జోకర్ గాళ్ళు, బ్రోకర్ గాళ్ళు ఎక్కువని విమర్శించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామలో దొంగ ఓట్లతో గెలించడని తెలిపారు. ఫొన్ ట్యాపింగ్‌తో, గతంలో బీఆర్ఎస్ గెలవడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ కొనసాగుతోందన్నారు.
చేర్యాల ప్రజలు డివిజన్ స్థాయి పనులకు పలు దిక్కులకు వెళ్లడం వల్ల ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో హరీష్ రావు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సోనియాగాంధీని ఒప్పించి తెచ్చిన దానిలో తన పాత్ర ఉందని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని 100% అమలు చేయడం కోసం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కృషి చేస్తున్నారన్నారు. రేషన్ కార్డులు,పెన్షన్లు ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. గతంలో ఎంపీగా ఉన్న రోజుల్లో ప్రతి గ్రామానికి మంచినీళ్లు కోసం బోరులు వేయడం జరిగిందని.. అలాగే వృద్ధులకు ఉచిత అనాథ ఆశ్రమం నిర్మించానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.. కేపీ
Discover more from
Subscribe to get the latest posts sent to your email.