నారద వర్తమాన సమాచారం
కాంగ్రెస్ లోకి తెల్లపూర్ ఇండిపెండెంట్ కౌన్సిలర్ కొల్లూరి భరత్..
మంత్రి కొండా సురేఖ, డిసిసి అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి సమక్షంలో200 మందితో కలిసి పార్టీలో చేరిక..
కాంగ్రెస్ కండువాల కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన మంత్రివర్యులు సురేఖ, ఎంపీ అభ్యర్థి నీలం మధు, పటాన్ చెరు నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, పటాన్ చెరు ఎలక్షన్ కోఆర్డినేటర్ శ్యామ్ గౌడ్,
కాంగ్రెస్ కు రుణపడి ఓటేయ్యాలి..కొల్లూరి భరత్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఓటేయ్యాలని కౌన్సిలర్ కొల్లూరి భరత్ విజ్ఞప్తి చేశారు. పటాన్చెరువు నియోజకవర్గం తెల్లపూర్ మున్సిపాలిటీ ఇండిపెండెంట్ కౌన్సిలర్ కొల్లూరి భరత్ రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ, మెదక్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు, పటాన్ చెరు నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, పటాన్ చెరు ఎలక్షన్ కోఆర్డినేటర్ అశోక్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసంద్భంగా ఆయన మాట్లాడారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన సంస్కరణల వల్లనే ఈవాళ ఆనేక మందికి ఉద్యోగాలు, ఉపాధి, విద్య, వైద్యం, కుడు, గుడు, ఉండానికి ఇండ్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు పేదలకు ఎంతో మేలు చేసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుందన్నారు. దీంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. భరత్ తోపాటు సుమారు 200 మంది కాంగ్రెస్ లో చేరారు. మంత్రివర్యులు కొండా సురేఖ, మెదక్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధులు కొల్లూరి భరత్ తోపాటు తన అనుచరులకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కొల్లూరి సత్తయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రవీందర్, కౌన్సిలర్లు సరిత శ్రీనివాస్ రెడ్డి, పావని రవీందర్, తూర్పు శ్రీనివాస్ రెడ్డి, అరుణ్ గౌడ్, రాజేష్ గౌడ్, గుల్ల రవి, నవారి శ్రీనివాస్ రెడ్డి, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ రావు, జనరల్ సెక్రెటరీ సుధాకర్ రెడ్డి, మయూరి రాజు గౌడ్, రాంసింగ్ నాయక్, మల్లేష్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, శశికళ, పసునూరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.