Saturday, December 13, 2025

ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదినం సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం…

ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదినం సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం…

83 యూనిట్ల రక్త సేకరణ..

నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి:మే 05,

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో సమాజ సేవకులు, ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్,ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తశిబిరం విజయవంతం అయింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జైళ్లశాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ డాక్టర్ దుద్దెల శ్రీనివాస్ మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల కోసం 82 మంది రక్తదాతలు రక్తదానానికి ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని,కామారెడ్డి రక్తదాతల సమూహం సంవత్సర కాలంలోనే 2306 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం అభినందనీయమన్నారు.
2007 నుంచి 20 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించడమే కాకుండా,యువతలో రక్తదాన ఆవశ్యకతను తెలియజేస్తూ,సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్న కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యులందరినీ అభినందించడం జరిగింది.రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసినందుకు డాక్టర్ బాలు,చింతల లక్మిపతి లకు తలసేమియా సికిల్ సెల్ సొసైటీ అవార్డులను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలు,డాక్టర్ వేదప్రకాష్,డాక్టర్ పుట్ల అనిల్ కుమార్, జమీల్ హైమద్,ఎర్రం చంద్రశేఖర్, వెంకటరమణ,కిరణ్,శ్రీకాంత్ రెడ్డి,రంగ కిషన్,ఆర్కే విద్యాసంస్థల సీఈవో జైపాల్ రెడ్డి,నవీన్,నరేందర్,రాజా గౌడ్,సాయి లు పాల్గొనడం జరిగింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading