Wednesday, February 5, 2025

నాడు పాత్రికేయుడు…నేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా జొన్నలగడ్డ

నారద వర్తమాన సమాచారం

నాడు పాత్రికేయుడు…నేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా జొన్నలగడ్డ

ఇరువురు మాజీ మంత్రులకు ధీటుగా ప్రచారంలో వినూత్నంగా దూసుకుపోతున్నా జొన్నలగడ్డ

ఈవీఎం బ్యాలెట్ నెంబర్ ఆరు లో కోటు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి*

సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందుతున్న జైభీమ్ రావ్ భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నలగడ్డ విజయ్ కుమార్. మొన్నటి వరకు ఆయన *పాత్రికేయుడు* ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వార్తలు రాశారు... ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించే సమయాల్లో సర్కారు నిర్ణయాలకు వ్యతిరేకంగా వార్తలు రాసి ప్రజల్ని చైతన్య వంతులను చేశారు. అంతేకాకుండా అధికారుల అవినీతులపై తనదైన శైలి కథనాలతో ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకొచ్చారు...నేడు సమాజంలో దాగిఉన్నా అవినీతి, కుళ్లు, కుట్రలు, కుతంత్రాలు కడిగి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు *రాజకీయాల్లోకి* అడుగులు వేశాడు...అతనే *పల్నాడు జిల్లా సత్తెనపల్లి వాసి జైభీమ్ రావ్ భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, పాత్రికేయుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్.* *ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న *డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్* స్పూర్తితో అడుగులు వేశాడు. యువత రాజకీయాల్లోకి రావాలి ప్రజా సేవలో మమేకం కావాలని *పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్* పిలుపు తో రాజకీయాల్లోకి వచ్చారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తున్నాడు. అతనే సత్తెనపల్లి పట్టణం రాజులకాలనికి చెందిన *జొన్నలగడ్డ విజయ్ కుమార్* *ఎం.ఏ.,ఎల్.ఎల్.బి* చదివారు. ఐదేళ్లు అధ్యాపకుడిగా పనిచేసిన జొన్నలగడ్డ అనంతరం ప్రముఖ పేపర్, ఛానల్ లో (ఈనాడు, ఈటీవీ) *పాత్రికేయులు* గా అవకాశం రావటంతో సుమారు *పన్నెండు* సంవత్సరాలు పనిచేసి *రాజకీయాల్లో* వచ్చారు. వైసీపీ..,తెదేపా, జనసేన., భారతీయ జనతా పార్టీ తదితర పార్టీల అభ్యర్థుల కంటే ముందుగా *జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) అధినేత జడ శ్రావణ్ కుమార్ జొన్నలగడ్డ విజయ్ కుమార్* అభ్యర్థిత్వాన్ని ఏడాదిన్నార క్రితమే ప్రకటించారు. దింతో అప్పటి నుంచే నియోజకవర్గంలో ఆయన ప్రజా క్షేత్రంలో తిరుగుతూ వారితో మమేకం అవుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు మూసదోరణి లో ప్రచారం చేస్తుంటే అతను మాత్రం వారికి భిన్నంగా ప్రచారం చేస్తూ చాపకింద నీరులా దూసుకుపోతున్నాడు. స్మశానంలో ఆత్మలను ఓటు అడగటం.. పాదచారుల చెప్పులు కుట్టటం... తాడిచెట్టెక్కి కల్లు తీయటం..,అట్లు పోయటం.,టీ పెట్టటం...కొలిమిలో మాలట్ కొట్టటం, వెల్డింగ్ పనులు, రిక్షా తొక్కటం, సోది చెప్పే వారి తంబూర వాయిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడు. దీనికీ తోడు స్థానికుడు యువకుడు.. విద్యావంతుడు కావటం వలస పక్షుల నుంచి నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామనే పిలుపు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన దగ్గర నుంచి ఓటర్లకు మరింత దగ్గరైందుకు ప్రచార ఆటో ద్వారా ప్రత్యక్ష ప్రచారాన్ని ప్రారంభించాడు.

స్మశానంలోఎన్నికల ప్రచారం..
ఓటర్ల జాబితాలో అవకతవకలు జాబితా పారదర్శకంగా లేదంటూ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారిలో మార్పు లేకుండా చనిపోయిన వారి పేర్లు సత్తెనపల్లి మండలం ఎన్నాదేవి గ్రామంలో 40 కి పైగా ఉన్నాయి. దీంతో స్మశానంలో సమాధుల వద్దకు వెళ్లి ఒక్కోక్క సమాది పైన కరపత్రాలు ఉంచి తనకు ఓటు వేయాలని ఆత్మలను ఓటు అడిగిన తీరు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. అదేవిధంగా చర్మకారుల సమస్యలు, వారి న్యాయమైన డిమాండ్స్ తెలుసుకునేందుకు వారి చెంతకు వెళ్లి పాదచారుల చెప్పులు కుట్టటం. చిన్నతరహా పరిశ్రమ నిర్వహకులు ఎదుర్కొంటున్నా సమస్యలపై కొలిమిలో మలాట్ కొట్టటం, వెల్డింగ్ షాపులో వెల్డింగ్ పనులు చేశారు. వీధి వ్యాపారులు కొబ్బరి బొండాలు, చెరుకు రసం అల్పాహార, టీ దుకాణాల నిర్వాహకులతో మాటలు కలపటం తో పాటు కల్లు గీత కార్మికులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.

బాధితుల తరుపున పోరాటాలు
సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో సుమారు 40 సంవత్సరాల నుంచి దళిత యువ రైతులు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే క్రమంలో దళిత యువ రైతుల తరపున పోరాటాలు చేసి ఆ భూమి వారికి ఉండేలా కృషి చేశారు. అదేగ్రామంలో ప్రభుత్వ మద్యం దుకాణం ఆదాయం రావట్లేదంటూ ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేస్తున్నడంతో కాలనీ వాసుల కు అండగా నిలబడి ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు వచ్చి ఆ ప్రయత్నాన్ని విరవింపజేశారు. దసరా., బతుకమ్మ దీపావళి, వినాయక చవితి, సంక్రాంతి, ఉగాది, ముక్కోటి ఏకాదశి రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులు..,క్రిస్మస్ పండుగకు పేదలకు శాంత క్లాజ్ వేషధారణలో బహుమతులు అందజేశారు. క్రైస్తవుల శ్రమల దినాల్లో చర్చిలో ప్రేమ విందు తదితర కార్యక్రమాలు నిర్వహించారు…
అయ్యప్ప మాల దారులకు ఉదయం బిక్షా ఏర్పాటు, దర్గా లో జరిగిన ప్రత్యేక దువా ఆయన పాల్గొని ప్రార్ధనలు చేయటం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటూ అన్ని వర్గాల వారితో కలిసిపోయారు. గుడిలో పూజలు.. మసీదు…దర్గా చర్చి ల్లో ప్రార్థనలు., బతుకమ్మ వేడుకల్లో కోలాట నృత్యం… ఇలా కుల, మతాలకు అతీతంగా ప్రజల్లో మమేకం అవుతున్నారు
ఇరువురు మాజీ మంత్రుల నడుమ బరిలో పాత్రికేయుడు :
ఒకరు యాభైఐదు… మరొకరు ఇంచుమించు అదే సంవత్సరాల అనుభవం కలిగిన సీనియర్లు… కళాశాల చదువుకునే రోజుల నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టి నేటికీ కొనసాగిస్తూ రాష్ట్ర స్థాయిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. వారిరువురూ *మాజీ మంత్రులు. తమ మాటల చాతుర్యంతో ప్రత్యర్థులపై *మాటల తూటాలు* పేల్చడంలో దిట్టా…ఒకరు యాభైఐదు… మరొకరు ఇంచుమించు అటుఇటుగా అదే సంవత్సరాల అనుభవం కలిగిన సీనియర్లు… కళాశాల చదువుకునే రోజుల్లో నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టి నేటికీ కొనసాగుతూ రాష్ట్ర స్థాయిలో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు…వారే తెదేపా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ., అదేవిధంగా వైకాపా నుంచి తాజా మాజీ మంత్రి అంబటి రాంబాబు అలాంటీ గండరపెండెముల నాయకులతో పాత్రికేయుడు జొన్నలగడ్డ ఎన్నికల బరిలో పోటీ పడుతున్నాడు. జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) పాత్రికేయుడు,న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ బరిలో నిలుచున్నారు. పట్టణ, గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ స్థానికత… యువకుడు… విద్యావంతుడని ప్రజా సేవకై తొలి అడుగు వేస్తున్నాడు. నియోజకవర్గంలో పేదలకు తన వంతుగా ఆర్ధిక, న్యాయ సహాయం అందిస్తూ వారికి నేను ఉన్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. ఈవీఎం బ్యాలెట్ నెంబర్ వరస సంఖ్య ఆరు లో కోటు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తూ ప్రచారంలో పరుగులు పెడుతున్నాడు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version