నారద వర్తమాన సమాచారం సతైనపల్లి :ప్రతినిధి
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నయం కేసు నమోదు చేయాలి
పాత్రికేయుడు చిట్టిబాబు పై దాడి హేయమైన చర్య.
పాత్రికేయుడికి అండగా జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్
ఇఫ్తార్ విందును చిత్రీకరించేందుకు వెళ్లినా పాత్రికేయుడు నందిగం చిట్టి బాబు పై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసు నమోదు చేయాలి జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జే బీ పీ) సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్నం పల్నాడు జిల్లా సత్తెనపల్లి కార్యాలయంలో పాత్రికేయుడు తనను కలసిన ఘటన వివరాలు తెలిపారు. అనంతరం విజయ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. మూడ్రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన నాయకులు పిడుగురాళ్ళ రోడ్డు ఈద్గా లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారన్నారు. సదరు విందును పాత్రికేయుడు చిట్టిబాబు విడియోలు తీస్తుండటంతో కొంతమంది వ్యక్తులు అడ్డుకున్నారని చెప్పారు. మీరెందుకు ఇక్కడికొచ్చారు… ఎవరూ మిమ్మల్ని పిలిచారు వీడియోలు, ఫోటోలు ఎందుకు తీస్తున్నారు అంటూ అతని చెంపలపై కొడుతూ చేతిలో ఉన్న చరవాణి లాక్కొని నేలకేసి కొట్టారని పేర్కొన్నారు. సదరు పాత్రికేయుడు చెంతనే ఉన్న పార్టీ పట్టణ నాయకుల దృష్టి కి తీసుకెళ్లినా వారు సరిగా స్పందించలేదన్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన పత్రికా రంగమని విధి నిర్వహణలో ఉన్న వ్యక్తి పై ఇలా దాడి చేయటం హేయమైన చర్యాని ఆయన పేర్కొన్నారు. వెంటనే సంభందిత అధికారులు స్పందించి ఘటనపై విచారించి బాధ్యులపై ఆమేరకు కేసు నమోదు చేయని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే సదరు పాత్రికేయుడికి అండగా ఉంటూ వీధి, న్యాయపోరాటానికైనా పార్టీ అండగా ఉంటుందని ఆయనకు భరోసా కల్పించాడు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.