నారద వర్తమాన సమాచారం
ఎన్నికలకు ప్రతిష్టమైన బందోబస్తుతో అన్ని ఏర్పాట్లు పూర్తి: కమిషనర్ అభిషేక్ మొహంతి
కమీషనరేట్ వ్యాప్తంగా 2500 పోలీస్ ఫోర్స్
కరీంనగర్ జిల్లా
:మే 11
కరీంనగర్ కమీషనరేట్ కేంద్రంలోని కాన్ఫెరెన్స్ హాలు నందు ఎన్నికలకు కేటాయిం చబడిన స్థానిక పోలీస్ అధికారులతో పాటు,కేంద్ర బలగాల అధికారులుతో శనివారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహం తి ఐపీఎస్ సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో మే 13 వ తేదీన నిర్వహించబోయే లోకసభ ఎన్నికలకు పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా సిబ్బంది కేటాయించామన్నారు. అన్నీ పోలింగ్ లొకేషన్లకు రూట్ ఆఫీసర్స్ తో పాటు స్ట్రైకింగ్ మరియు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ లను కేటాయించామన్నారు.
సున్నితమైన మరియు సమ స్యాత్మక ప్రాంతాల్లో స్థానిక పోలీసులతో పాటు, కేంద్ర పారా మిలిటరీ బలగాలను కేటాయించామన్నారు. సమావేశానికి హాజరైన అధికారులందరికీ వారి వారి సిబ్బందికి కింది సూచన లను తెలియచేయాల న్నారు.
ఎన్నికల రోజు ముందు నాడే అనగా ఆదివారం రోజున ఎన్నికల డిస్ట్రిబ్యూ షన్ సెంటర్లకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎన్నికల సామాగ్రిని మరియు ఈవీఎంలను స్వీకరించిన తరువాత వాటికి భద్రతగా వారితో పాటు , కేటాయించబడిన పోలింగ్ లొకేషన్ , కేంద్రాన్ని తెలుసుకుని వారి వెంటే పోలింగ్ కేంద్రాలకు చేరుకో వాల్సి ఉంటుందన్నారు.
పోలింగ్ కేంద్రాలకు చేరుకు న్నప్పటి నుండి ఎన్నికలు ముగిసే వరకు ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రాన్ని విడిచి వెళ్లరాదని సూచించారు. పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్ణయిం చబడినప్పటికీ పోలింగ్ రోజున ఉదయం 06 గంటలకే విధులకు హాజరై సంసింద్దంగా ఉండాల న్నారు.
పోలింగ్ రోజున ఓటర్లను క్యూ పద్దతిలో ఉండేలా చూసుకోవాలన్నారు. ఓటు వేసేందుకు వచ్చే మహిళ లు , వృద్ధులతోపాటు అన్ని వర్గాల ప్రజలతో సత్ప్రవర్త నతో మెదలాలన్నారు.
ఏదైనా పోలింగ్ కేంద్రం వద్ద శాంతి భద్రతల సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించి వాటిని నివారించేందుకు రూట్ ఆఫీసర్ , స్ట్రైకింగ్ ఫోర్స్ , స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారులను కేటాయించామని ఆయా అధికారుల ఫోన్ నంబర్లను ప్రతి ఒక్కరు కలిగి ఉండా లని , సమస్యలు తలెత్తితే వెంటనే వారికి తెలపాలని సూచించారు.
ప్రిసైడింగ్ అధికారి అనుమ తి లేనిదే ఎట్టిపరిస్థితుల్లో పోలింగ్ కేంద్రంలోకి వెళ్ల రాదని, వారు పిలిస్తేనే వెళ్లాలని సూచించారు. ఎప్పటికప్పుడు అప్రమ త్తంగా వుంటూ ఎన్నికలు ప్రశాంతగా ముగిసేలా కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఎ లక్ష్మీనారాయణ తో పాటు కేంద్ర బలగాల అధికారులు , స్థానిక పోలీస్ అధికారులు పాల్గొన్నారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.