నారద వర్తమానం సమాచారం
తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నేడు పోలింగ్
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరుకు నేటితో తెరపడనుంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. నేడు మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నేడు సాయంత్రానికి అభ్యర్థులు భవితవ్యం తేలనుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోసం 43,856 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. చివరి విడత.. 36,452 వార్డుల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు.
116 వార్డులకు నామినేష న్లు దాఖలు కాలేదు. 7,908 ఏకగ్రీవమయ్యాయి. 18 వార్డుల పోలింగ్‌పై కోర్టు స్టే విధించడంతో మిగిలిన 28,410 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. 75,725 అభ్యర్థులు బరిలోకి దిగారు.
కరీంనగర్ జిల్లా: చివరి విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం.. మూడు విడతల్లో పంచాయితీ ఎన్నికల పోలింగ్ కు నేటితో ముగింపు.. చివరి మూడో విడతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 408 స్థానాలకు నోటిఫికేషన్.. 22 ఏకగ్రీవం కావడంతో నేడు 386 స్థానాల్లో ప్రారంభం కానున్న పోలింగ్ ప్రక్రియ.. ఉమ్మడి జిల్లాలోని జిల్లాల వారీగా చూస్తే మూడో విడతలో కరీంనగర్ జిల్లాలో 111 గ్రామాలకు గాను ఇప్పటికే 3 ఏకగ్రీవం కావడంతో నేడు 108 స్థానాల్లో జరుగుతున్న పోలింగ్..
జగిత్యాల జిల్లాలో 119 గ్రామాలకు 6 ఏకగ్రీవం కావడంతో 113 స్థానాలకు జరుగుతున్న పోలింగ్.. పెద్దపెల్లి జిల్లాలో 91 స్థానాలకు 6 ఏకగ్రీవం కావడంతో 85 స్థానాల్లో జరుగుతున్న పోలింగ్.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 87 స్థానాలకు 7 ఏకగ్రీవం కావడంతో నేడు 80 పంచాయితీలకు జరుగుతున్న పోలింగ్.. మధ్యాహ్నం 1గంటల వరకే ఓటింగ్.. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం.. తొలి గంటలోనే వెలువడనున్న చిన్న పంచాయతీల ఫలితాలు.. నేటితో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మొత్తం 1224 గ్రామ పంచాయితీలకు ముగియనున్న ఎన్నికల ప్రక్రియ..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







