![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/05/img-20240511-wa01345073917044545271752-1024x576.jpg?resize=696%2C392&ssl=1)
నారద వర్తమాన సమాచారం
సొంతూళ్లకు వెళ్దాం, సోమవారం ఓటేద్దాం….రద్దీగా మారిన జాతీయ రహదారులు
ఓట్ల పండుగ వచ్చింది.ఐదేళ్లకొకసారి వచ్చే ప్రజాస్వామ్య పండుగలో మేము సైతం భాగస్వామ్యులు కావాలని ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు.ఓటేసేందుకు తమ సొంత ఊర్లకు తరలివెళ్తున్నారు.
హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ ప్రజలంతా స్వస్థలాలకు క్యూ కట్టడంతో రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో సీట్లన్నీ నిండుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లోని బస్టాండ్‌లలో సందడి వాతావరణం నెలకొంది.
మరోవైపు సరిపడా బస్సులు లేకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దొరికిందే అనువుగా ఛార్జీల మోత:
స్వగ్రామాలకు వెళ్లేందుకు కొందరు సొంత వాహనాల్లో వెళ్తుంటే, ఇంకొందరు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, రైళ్లను ఎంచుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ నగరమంతా దాదాపుగా ఖాళీ అవుతోంది. పదిరోజుల నుంచే బస్సుల్లో సీట్లన్ని నిండుకున్నాయి. ముందస్తు బుకింగ్‌లు అయిపోవడంతో ప్రత్యమ్నాయ మార్గాలవైపు చూస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లో వెళ్దాం అనుకుంటే దొరికిందే అనువుగా ఛార్జీలు అధికంగా పెంచేశారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.