నారద వర్తమాన సమాచారం
మే ;15
నాసిరకం మరియు కాలం చెల్లిన ఐస్-క్రీమ్ తయారీదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి
విజిలెన్స్ కమిటి సభ్యులు డా!! చదలవాడ హరిబాబు మరియు పిల్లి యజ్ఞ నారాయణ
ది.15-05-2024న ప్రముఖ దినపత్రికలో వచ్చిన “ఐస్-క్రీమ్ తిని చిన్నారికి అస్వస్థత” వార్తపై ఆహార కల్తి నియంత్రణ అధికారులు వెంటనే స్పందించి బాద్యులైన వ్యక్తులు మరియు సంస్థలపై చర్యలు తీసుకోవలసినదిగా గుంటూరు జిల్లా విజిలెన్స్ కమిటి సభ్యులు డా!! చదలవాడ హరిబాబు మరియు పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటి సభ్యులు పిల్లి యజ్ఞ నారాయణ ఐ.పి.యమ్. డైరెక్టర్ పూర్ణ చంద్రరావుకు ఫిర్యాదు చేసారు. సదరు ఫిర్యాదులో, పల్నాడు జిల్లా నరసరావుపేట లో తయారుచేసి ప్రకాశం జిల్లా తర్లపాడు మండలం గానుగపెంట గ్రామంలో విక్రయించిన ఐస్-క్రీమ్ తిని ఆ చిన్నారి అస్వస్థకు గురిఅయినందున నరసరావుపేట పట్టణంలో వున్న అన్ని ఐస్-క్రీమ్ తయారి కేంద్రాలలో తయారీ విధానం, పరిసర ప్రాంతాలు, వినియోగించుచున్న పదార్ధాలను క్షుణ్ణంగా పరిశీలించ వలసినదిగాను మరియు సదరు ఐస్-క్రీమ్ తయారీదారుల వద్ద సాంపిల్స్ సేకరించి మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ నందు పరిశీలించ వలసినదిగాను లేదా సదరు మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ ఒక యూనిట్ నరసరావుపేటకు పంపి క్షుణ్ణంగా పరిశీలించి, ఐస్-క్రీమ్ తయారిలో ఏమన్నా లోపాలుంటే చట్టపరంగా చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడవలసినదిగా కోరారు. ప్రస్తుతం ఎండాకాలం అయినందున ఎండల తీవ్రతకు ఉపసమనం కోసం చల్లగా తినాలని పిల్లలు, పెద్దలు ఇంటి వద్దకు వచ్చే ఐస్-క్రీమ్ బండ్ల వద్ద కొన్నవి తిని అస్వస్థకు గురవుచున్నారని, ఐస్-క్రీమ్ తయారి విధానంలో నాణ్యత ప్రమాణాలు పాటించటం లేదని ప్రజల నుండి చాల ఫిర్యాదులు వచ్చినను ఇప్పటివరకు వారిపై చర్యలు తీసుకోకపోవటం చాలా దారుణం అని, ఇప్పటికైనా క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవలసినదిగా ఫిర్యాదులో కోరారు.
పొదిలిలో మరో ఘటన
పొదిలిలో బ్లు బెల్ నాసిరకం ఐస్ క్రీమ్ తిని వాంతులు విరోచనాలతో అనారోగ్య పాలైన నలుగురు కుటుంబ సభ్యులు, అందులో ముగ్గురు చిన్నారులకి తీవ్ర అస్వస్థత హుటాహుటిన బాధితులను హాస్పిటల్ కు తరలింపు. బ్లూ బెల్ ఐస్ క్రీమ్ కంపెనీ తరఫున అమ్ముతున్న ముగ్గురిని పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పిన బాధితులు. ఈ సంఘటన మీద కూడా గుంటూరు జిల్లా విజిలెన్స్ కమిటి సభ్యులు డా!! చదలవాడ హరిబాబు మరియు పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటి సభ్యులు పిల్లి యజ్ఞ నారాయణ ఇరువురు ఐ.పి.యమ్. డైరెక్టర్ పూర్ణ చంద్రరావుకు ఫిర్యాదు చేసారు.
పిర్యాదుపై స్పందించిన ఐ.పి.యమ్. డైరెక్టర్ పూర్ణ చంద్రరావు వెంటనే ఆహార కల్తీ నిరోధక అధికారులను ప్రకాశం జిల్లా తర్లపాడు మండలం గానుగపెంట గ్రామం మరియు పొదిలి ప్రాంతాలకు పంపి వారి వద్ద వున్న ఐస్ క్రీమ్ సాంపిల్స్ తీసుకొన్నామని, కాలం చెల్లిన ఐస్ క్రీమ్ విక్రయిస్తున్నట్లుగా గమనించి వాటిని పారవేయటం జరిగిందని తెలియజేసారు. అలాగే నరసరావుపేట నందు ఐస్-క్రీమ్ తయారి కేంద్రాలకు కూడా ఒక బృందాన్ని పంపి సాంపిల్స్ తీసుకొన్నామని తెలియజేసారు. ఈ ఘటనపై సానుకూలంగా వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న ఐ.పి.యమ్. డైరెక్టర్ పూర్ణ చంద్రరావుకు గుంటూరు జిల్లా విజిలెన్స్ కమిటి సభ్యులు డా!! చదలవాడ హరిబాబు మరియు పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటి సభ్యులు పిల్లి యజ్ఞ నారాయణ ఇరువురు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రజలు రాష్ట్రంలో ఎక్కడైనా నాసిరకం ఆహర పదార్ధాలపై ఫిర్యాదులు వుంటే వెంటనే మీ ప్రాంత ఆహార కల్తి నిరోధక అధికారులకు లేదా విజిలెన్స్ కమిటి సభ్యులు డా!! చదలవాడ హరిబాబు ఫోన్ నెంబర్ – 9849500354, పిల్లి యజ్ఞ నారాయణ ఫోన్ నెంబర్ – 9866804230కు గాని ఫిర్యాదు చేసిన సంబందిత అధికారులకు తెలియజేసి వెంటనే చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలియజేసారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.