నారద వర్తమాన సమాచారం
మే :15
పొలిటికల్ విశ్లేషణ,
ప్రతి గ్రామంలో సమన్వయ కమిటీలు వేయవలసిన అవసరం ఉన్నది
పల్నాడు ప్రాంత ప్రజలు వారి వారి గ్రామాల అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు
వారి వారి ప్రాంతాల అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు, పలనాటి పౌరుషాలు పలనాటి వీరుల కథ పలనాటి లోని ఉన్న ప్రతి పౌరుడికి ప్రతి మహిళలకు తెలుసు
పల్నాడు ప్రాంతంలో పరిశ్రమలు రావాలి,
పల్నాటి ప్రాంతంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రావాలి,
పల్నాడు ప్రాంతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ అభివృద్ధి చెందాలి,
పల్నాడు ప్రాంతంలో రైతులుబాగుపడాలి,
పల్నాడు ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి,
పల్నాడు ప్రాంతంలోని ప్రజలు ఆర్థిక స్వలంబన జరగాలి?
పల్నాడు ప్రాంతంలో పరిశ్రమకు కారిడార్లు రావాలి
ఇప్పుడిప్పుడే పల్నాడు ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయి,
భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగరీత్యా పల్నాడు ప్రాంతానికి వచ్చుచున్నారు,
ఇప్పుడిప్పుడే పల్నాడు ప్రాంతం ప్రజలు ప్రశాంతత కోరుకుంటున్నారు
పల్నాడు ప్రాంతంలో అధికారులు ఈ గొడవలు గందరగోళాలు జరగకుండా సత్వరమైన చర్యలు తీసుకొని పల్నాడు పీస్ కమిటీని ఏర్పాటు చేసి గ్రామాల వారిగా అన్ని పార్టీలను ఇన్వాల్వ్ చేసి ఆయా గ్రామాలలో పీస్ కమిటీని ఏర్పాటు చేయవలసినదిగా పల్నాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు
దీని అనుగుణంగా ఇరు పార్టీ లీడర్లు, వారి వారి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పల్నాడు ప్రాంత అభివృద్ధి కొరకై కలిసి పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు
బాంబులు మాకొద్దు!
కత్తులు మాకొద్దు!
గొడవలు మాకొద్దు!
మా కుటుంబాలే మాకు ముద్దు
మా ప్రాంత అభివృద్ధి మాకు ముద్దు
ఇట్లు~~~~
మీ ప్రాంత శ్రేయోభిలాషి మీ, అంబటి నవ కుమార్.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.