
నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి:
జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ.
విత్తన దుకాణాలను పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ.
నారద వర్తమాన సమాచారం:
భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
మార్కెట్లకు వస్తున్న నకిలీ వరి విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ సూచించారు.
పురపాలక కేంద్రంలో శనివారం పిఎసిఎస్ పోచంపల్లి, కనకదుర్గ ఫర్టిలైజర్స్, గోదావరి ఫెర్టిలైజర్ దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాలలో ఉన్న వివిధ విత్తనాల ప్యాకెట్లను పరిశీలించి అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరి పంటకు సంసిద్ధమవుతున్న రైతులు మార్కెట్లో వస్తున్న వరి విత్తనాలను పరిశీలించి తీసుకోవాలని కోరారు. లైసెన్స్, లేబుల్ కలిగిన విత్తన ప్యాకెట్లను కొనుగోలు చేయడంతో పాటు దానికి సంబంధించిన బిల్లుని రైతులు దుకాణదారుడు వద్ద తీసుకోవాలని ఆమె సూచించారు. ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఒకవేళ నకిలీ విత్తనాలు ద్వారా పంట నష్టమైన నష్టపరిహారం పొందే విధంగా వీలుంటుందని ఆమె తెలిపారు. తెల్ల కవర్లలో వస్తున్న విత్తనాలను రైతులెవ్వరు కొనుగోలూ చేయొద్దని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి వరి పంటలో అత్యధిక దిగుబడి సాధించి లాభాలు పొందాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు దేవ్ సింగ్, మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారి నరేష్ తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.