నారద వర్తమాన సమాచారం
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఊబర్ త్వరలో బస్సు సేవలను ప్రారంభించనుంది.
న్యూ ఢిల్లీ:
మే :21
దేశ రాజధాని నగరం దిల్లీలో తొలుత ఈ సేవలను ప్రారంభించనుంది. దిల్లీ ప్రీమియం బస్ స్కీమ్ కింద ఇకపై బస్సులను ఊబర్ సంస్థ నడపనుంది. ఈ మేరకు దిల్లీ రవాణా మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా లైసెన్స్ అందుకుంది. ఈ తరహా లైసెన్స్ జారీ చేసిన తొలి రవాణా శాఖ దిల్లీనే. దీన్ని అందుకున్న తొలి అగ్రిగేటర్‌గా ఉబర్ నిలిచింది.
ఏడాదిగా దిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు, కోల్‌కతాలోనూ ప్రయోగాత్మకంగా ఈ సేవలు నడుపుతున్నామని ఉబర్ షటిల్ ఇండియా హెడ్ అమిత్ దేశ్‌పాండే చెప్పారు. దిల్లీలో బస్సులకు విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు గమనించామన్నారు. ఇప్పుడు అధికారికంగా తమ సేవలను దిల్లీలో ప్రారంభించ. బోతున్నామని తెలిపారు. బస్సు సర్వీసులకు వారం ముందు నుంచే ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చని ఉబర్ తెలిపింది.
బస్సు రాబోయే సమయం, బస్సు లైవ్ లొకేషన్, బస్సు రూట్లను ఎప్పటికప్పుడు ఉబర్ యాప్‌లో తెలుసుకోవచ్చని పేర్కొంది. ఒక్కో సర్వీసులో 19-50మంది ప్రయాణించడడానికి వీలుంటుందని తెలిపింది. ఉబర్ టెక్నాలజీ సాయంతో స్థానిక ఆపరేటర్లు వీటిని నడుపుతారని ఊబర్ తెలిపింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.