Tuesday, March 17, 2026
spot_img

భారత స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థకు (నావిక్‌ )కు ఎదురుదెబ్బ!

నారద వర్తమాన సమాచారం

భారత స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థకు (నావిక్‌ )కు ఎదురుదెబ్బ!

భారత స్వదేశీ నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ నావిగేషన్‌ విత్‌ ఇండియన్‌ కాన్‌స్టెలేషన్‌(నావిక్‌)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నావిక్‌లోని నాలుగు కార్యాచరణ ఉపగ్రహాల్లో ఒకటి విఫలమైనట్లు ఇస్రో తెలిపింది. దీన్ని ప్రయోగించిన 10 సంవత్సరాల తర్వాత ఇది విఫలమైనట్లు ఇస్రో పేర్కొన్నది. 2016 మార్చి 10న ప్రయోగించిన ఇండియన్‌ రీజినల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌కు చెందిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ 1-ఎఫ్‌ చివరి నిర్వాహక ఆటమిక్‌ క్లాక్‌(అణు గడియారం) పనిచేయకపోవడంతో అది విఫలమైనట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. దాని లోపల ఉన్న మూడు అణు గడియారాల్లో ఒకదానితో మాత్రమే ఉపగ్రహం పనిచేస్తున్నదని వారు చెప్పారు. నావిక్‌ వ్యవస్థ ప్రజలకు, రైల్వేలు, సైన్యం వంటి ప్రభుత్వ సంస్థలకు నావిగేషన్‌ సేవలను అందించడానికి కనీసం నాలుగు స్వదేశీ నావిగేషన్‌ ఉపగ్రహాలు పూర్తిగా పనిచేయాల్సి ఉంటుంది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version