నారద వర్తమాన సమాచారం
నమ్మించి యువతిపై అత్యాచారం…..
చేబ్రోలు పోలీసులు కేసు నమోదు
గుంటూరు జిల్లా
యువతిని నమ్మించి అత్యాచారం చేసిన ఘటనపై చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. తెనాలి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని స్థానిక విద్యాలయంలో చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
అదే కళాశాలలో చదువుతున్న నందుతో ఆమెకు పరిచయం ఏర్పడిందని విచారణలో వెల్లడైంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇద్దరూ పలుమార్లు హోటళ్లలో కలుసుకున్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
తరువాత నారాకోడూరు, గుంటూరు పరిసరాల్లోని లాడ్జీలకు తీసుకెళ్లి బలవంతానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించింది. అంతేకాకుండా ఆమె ఫోటోలు, వీడియోలు తీసి డబ్బు కోసం వేధింపులకు గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చేబ్రోలు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







