పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కి మద్దతుగా ప్రచారం నిర్వహించిన బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి…
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా, మే 23,
వరంగల్ ఖమ్మం నల్గొండ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మద్దతుగా ప్రచారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర నాయకులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ తో కలిసి పాల్గొనడం జరిగింది
ప్రచారంలో భాగంగా డా. పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ..
ఖమ్మం వరంగల్ నల్గొండ
పట్టభద్రుల ఉప ఎన్నికల్లో జనగామ పట్టణంలో స్థానిక బిజెపి నాయకులతో పైడి ఎల్లారెడ్డి ప్రచారంలో భాగంగా
గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరడం జరిగింది. ప్రచారం చేస్తుంటే ఓటర్ల నుండి అపూర్వ స్పందన వస్తుందని రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డి గెలవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో క్లీన్ చీట్ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి అని అన్నారు. ఉద్యోగుల నుండి నిరుద్యోగుల నుండి గ్రాడ్యుయేట్ ఓటర్ల నుండి బిజెపి అభ్యర్థికి ఓటు వేయడానికి అనుకూలంగా ఉన్నామని ఓటర్లు చెప్పడం జరిగింది.ప్రశ్నించే గొంతు అంటూన్నారని తీన్మార్ మల్లన్న ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడని ఎద్దేవా చేశారు నిరుద్యోగ భృతి విషయంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ పై పోటీలో ఉన్న తీన్మార్ మల్లన్న ప్రభుత్వంపై ఎందుకు ప్రశ్నించలేడని అన్నారు.
మెగా డీఎస్సీ అమలు కావాలంటే గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత (1)ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది.కార్యక్రమంలో జనగామ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత్ రెడ్డి స్థానిక జనగామ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.