నారద వర్తమాన సమాచారం
మే :28
డిల్లీ మద్యం వ్యాపారం గురించి కేసీఆర్ కు ముందే తెలుసు:ఈడీ
దిల్లీ: దిల్లీ మద్యం విధానం కేసులో మరిన్ని సంచలన విషయాలను ఈడీ బయటపెట్టింది. దిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై వాదనల సందర్భంగా ఈడీ కీలక విషయాలు కోర్టు దృష్టికి తెచ్చింది..
దిల్లీ మద్యం విధానం, రిటైల్ స్కామ్ గురించి ముందుగానే కవిత.. కేసీఆర్‌కు చెప్పారని పేర్కొంది. దిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే తన టీమ్ సభ్యులైన బుచ్చిబాబు, అభిషేక్, అరుణ్ పిళ్లైను కవిత.. కేసీఆర్‌కు పరిచయం చేశారని ఈడీ తెలిపింది..
ఆమె పరిచయం చేసిన వారి నుంచి కేసీఆర్ వివరాలు తెలుసుకున్నారని, కేసీఆర్‌కు సమీర్ మహేంద్రును బుచ్చిబాబు పరిచయం చేశారని వెల్లడించింది. ”కేసీఆర్‌తో భేటీ వివరాలను గోపీ కుమరన్ వాంగ్మూలంలో రికార్డు చేశారు. కవిత రెండేళ్లలో సుమారు 11 మొబైల్ ఫోన్లు వాడారు.. అందులో నాలుగు ఫోన్లలోఉన్న ఆధారాలను ధ్వంసం చేశారు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు” అని ఈడీ తెలిపింది. కవిత బెయిల్ పిటిషన్లపై దిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వు చేశారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.