జిల్లాలో నిషేదిత గుట్కా అక్రమ నిల్వ, అమ్మకం చేస్తున్న వారిపై కేసులు నమోదు – జిల్లా ఎస్పీ సింధు శర్మ…
జిల్లా వ్యాప్తంగా 31 నిషేదిత గుట్కా కేసులు నమోదు
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి : జూన్ 02
ఎస్పీ సింధు శర్మ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా గుట్కా అక్రమ నిల్వ, అమ్మకాలపై జిల్లా వ్యాప్తంగా దాడులు చేస్తున్నట్లు ఎస్పి తెలిపారు …దీనిలో భాగంగా కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, దోమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, బిక్నూర్ పోలీసులు పరిధిలో మూడు కేసులు, తాడ్వాయి పోలీసులు పరిధిలో ఒక్క కేసు, పిట్లం పోలీసులు పరిధిలో ఒక్క కేసుగా, గాంధారి పోలీసు స్టేషన్ పరిధిలో రెండు కేసులు, ఎస్ ఎస్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు కేసులు, రాజంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు కేసులు, బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్క కేసు, మద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్క కేసుగా గా మరియు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు జరుగుచున్నవి.
ఈ సందర్బంలో జిల్లా ఎస్పి మాట్లాడుతూ ఇకపై ఎవరైన ఇలాంటి నిషేదిత గుట్కా అక్రమ నిల్వ, అమ్మకం చేస్తు ప్రజల ప్రాణాలకు హాని కలిగించే మరియు నీషేదిత మత్తు పదార్థాలు సరఫరాచేసిన, అమ్మిన,కొన్న, వాడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోబడును అని తెలిపినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.