పల్నాడు జిల్లా…
నారద వర్తమాన సమాచారం
జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాస రావు ఐపిఎస్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా యాంటీ సబ్టేజ్, లాడ్జిల చెకింగ్ మరియు వాహనాల తనిఖీ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు…
ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి పల్నాడు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీ చేసిన రైల్వే స్టేషన్ లు, బస్టాండ్లు,లాడ్జీలు వాహనాలు తనిఖీలు…
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి లాడ్జిలు మరియు వాహన తనిఖీలు, యాంటీ సబ్టేజ్ గురించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది.
జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగించిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ మందు బాబు లను హెచ్చరించారు.
ఈరోజు జిల్లా వ్యాప్తంగా సాయంత్రం వేళ ప్రధాన రహదారులపై పోలీసు అధికారులు సిబ్బంది విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు.
ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై దాడులు చేయాలని, వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు.
జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు,సిబ్బంది వారి స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఖాళీ ప్రదేశాలు
శివారు ప్రాంతాల్లోను, నగర శివారు ప్రాంతాల్లోను, బహిరంగంగా మద్యం సేవించిన వారిపై పోలీసు అధికారులు,దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేస్తున్నారు.
సాయంత్రం వేళ వాహన తనిఖీలు చేపట్టి పోలీసు అధికారులు, సిబ్బంది రహదారి భద్రత నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడిపిన వాహనదారుల పై కేసులు నమోదు చేసారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.