నారద వర్తమాన సమాచారం
జూన్ :07
ఏపీలో ఎన్నికల ఫలితాలపై భిన్నాభిప్రాయాలు..
_ ఈవీఎం ట్యాంపరింగ్‌పై రాజకీయ రచ్చ..
ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారంలో రచ్చ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారన్న మాజీ ఎమ్మెల్యే రవీంద్రానాథ్ కామెంట్స్ కాక రేపుతున్నాయి.
అయితే.. ట్యాంపరింగ్‌కు అవకాశమే లేదంటున్నారు కూటమి నేతలు. ఏపీలో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఫలితాలపై వైఎస్ జగన్‌తో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు.
ఏదో జరిగిందని అనొచ్చని, కానీ.. అందుకు తగ్గ ఆధారాలు లేవని జగన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారనే అర్థం వచ్చేలా జగన్ మాట్లాడడం, ఆ తర్వాత వైసీపీ నాయకులంతా అదే బాటలో పయనిస్తున్నారు.
ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియాలో కూడా రకరకాల వార్తలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఎవరి అభిప్రాయం వారు వ్యక్త పరుస్తు రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులు స్పందించారు. చంద్రబాబు ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి. వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు సెలెక్ట్ చేసుకున్న బూత్‌ల్లోనూ ట్యాంపరింగ్ చేశారని మండిపడ్డారు.
త్వరలో కోర్టుకు కూడా వెళ్తామని రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.
వైసీపీ ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్. ఈవీఎలం ట్యాంపరింగ్‌కు అవకాశమే లేదని స్పష్టం చేశారు.
ఇక.. ఈవీఎంలను అనుమానిస్తే.. ప్రజలను అవమానించినట్లే అన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసినట్లు ఆరోపిస్తున్న వైసీపీ నేతల తీరుపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సెటైర్లు వేశారు.
వైసీపీ నేతలది.. గెలిస్తే ఓ మాట.. ఓడితే ఒక మాట అన్నట్లుగా ఉందన్నారు. గతంలో వైసీపీ 151 సీట్లు గెలిచినప్పుడు లేని అనుమానాలు ఇప్పుడెందుకు వస్తున్నాయని ప్రశ్నించారు ఆదినారాయణరెడ్డి.
మొత్తంగా.. ఈవీఎలం ట్యాంపరింగ్‌ల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారుతోంది. వైసీపీ నేతలను ఆరోపణలను బీజేపీ ఎమ్మెల్యేలు ఖండిస్తున్నప్పటికీ ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అనుమానాలు రేకెత్తుతూనే ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఏదేమైనా రాబోయే రోజుల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.