నారద వర్తమాన సమాచారం
జూన్ :08
రామోజీరావు యుగపురుషుడు!
ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మరణించారని తెలుసుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా ఉన్న బాబు.. హైదరాబాద్‌కు వచ్చి రామోజీరావు పార్థివదేహానికి కన్నీటి నివాళులు అర్పించారు.! చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు పలు విషయాలను పంచుకున్నారు. రామోజీరావు మరణం చాలా బాధాకరమని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
రామోజీ.. రాజీపడరు!
‘రామోజీరావు మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. రామోజీరావు మరణం మీడియా, సినీ రంగానికి తీరని లోటు. సమాజహితం కోసమే అనునిత్యం రామోజీరావు కష్టపడ్డారు. తెలుగుజాతి కోసం అహర్నిశలు పనిచేశారు. రామోజీరావు వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ. రామోజీరావు కారణ జన్ములు.. యుగపురుషుడు. చిత్రపరిశ్రమకు రామోజీరావు ఎనలేని సేవలు చేశారు. రామోజీరావు నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం. తెలుగుజాతిని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేశారు.. రాష్ట్రాభివృద్ధికి ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళ్తాం. ఈనాడు ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని, విజ్ఞానవంతుల్ని చేశారు. ఏ పనిలోనూ రామోజీ రాజీపడేవారు కాదు. రామోజీరావు మొదట్నుంచీ ప్రజల పక్షాన నిలబడిన గొప్ప వ్యక్తి. రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. రామోజీ కుటుంబ సభ్యులు, ఉద్యోగులకు నా ప్రగాఢ సానూభూతి తెలియజేస్తున్నాను’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఆదివారం అంత్యక్రియలు!
రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు. ఉదయం 9 – 10 గంటల మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఫిలింసిటీలోని ఆయన నివాసంలో రామోజీరావు పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకుని.. రామోజీరావు పార్థీవదేహానికి నివాళులు అర్పిస్తున్నారు.!
Discover more from
Subscribe to get the latest posts sent to your email.