పోలీస్ సిబ్బంది పిల్లలకు సమ్మర్ క్యాంపు నిర్వహణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ సింధు శర్మ..
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి:జూన్ 08,
- 15 రోజులుగా జిల్లా పోలీస్ సిబ్బంది పిల్లలకు సమ్మర్ క్యాంపు నిర్వహణ
- ముగింపు కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ సింధు శర్మ ఐపీఎస్..
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శిశమందిరు స్కూల్ నందు పోలీస్ సిబ్బంది పిల్లలకు వేసవి సెలవుల సందర్బంగా సమ్మర్ క్యాంపు ను రెండు వారాల పాటు నిర్వహిచడం జరిగినది. ఈ క్యాంపు లో భాగంగా పిల్లలకు డ్రాయింగ్,పెయింటింగ్
డాన్స్,సింగింగ్ , కరాటే వంటి వాటిల్లో శిక్షణ ఇప్పించడము జరిగినది. దానికి గాను సుశిక్షితులైన టీచర్లను,కోచ్ లను నియమించినారు.పిల్లలకు చదువులతో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యతనిచ్చేలా తల్లిదండ్రులు చూసుకోవాలన్నారు. ఆటల వలన మానసికోల్లాసమే కాకుండా శారీరక ధృడత్వంతో పాటు ఆత్మవిశ్వాసము పెంపొందుతుందని జిల్లా ఎస్పీ తెలిపినారు.అదే విధంగా పిల్లలకు శిక్షణ ఇచ్చిన వంశీ ప్రసాద్ గౌడ్ డాన్స్, నవ్య శ్రీ పెయింటింగ్, సంజు కుమార్ చెస్,కరాటే అనిల్ కుమార్, సింగింగ్ నవీన్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం జరిగినది వీరిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించడం జరిగినది.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి అడ్మిన్ కె. నరసింహారెడ్డి, కామారెడ్డి టౌన్ యస్ ఎచ్ ఓ చంద్రశేకర్ రెడ్డి , ఎస్బి ఇన్స్పెక్టర్ తిరుపయ్య, పిల్లల తల్లిదండ్రులు లతో పాటు టీచర్లు, కోచ్ లు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.