పెళ్లిరోజు సందర్భంగా రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం.
సకాలంలో మహిళకు బి పాజిటివ్ రక్తం అందజేసిన కటేపల్లి నాగరాజు..
నారద వర్తమాన సమాచారం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి:
జూన్08,
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతు..
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ వైద్యశాలలో లక్ష్మి (42) కి బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో గోపాల్ పేట్ మండలం కి చెందిన కటేపల్లి నాగరాజు కి తెలియజేయడంతో మానవతా దృక్పథంతో స్పందించి రక్త దానానికి ముందుకు రావడం జరిగింది అన్నారు.ఈ రోజు మొదటి వివాహ వార్షికోత్సవం కావడం ఆపదలో ఉన్న మహిళకు సహాయం చేసే అవకాశం దొరకడం సంతోషాన్ని కలిగించిందని రక్తదాత తెలియజేశారు.రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత నాగరాజుకు ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా,రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్నల తరఫున అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ క్రియాశీలక సభ్యుడు సురేష్ రెడ్డి టెక్నీషియన్లు జీవన్ వెంకటేష్ సంతోష్ లు పాల్గొనడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.