నారద వర్తమాన సమాచారం
జూన్ :12
నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ నిర్వహించాలని కోరిన ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్.
ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ మాట్లాడుతూ ఎన్ టి ఎ విడుదల చేసిన నీట్ ఫలితాలలో దేశవ్యాప్తంగా 67 మంది విద్యార్థులకు 720 మార్కులు రావడం అందులో దాదాపు 6 గురు విద్యార్థులు హర్యానా లోని ఓకే పరీక్ష కేంద్రంకి సంభందించిన వారు కావడం అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నయన్నారు.
కావున కేంద్ర ప్రభుత్వం దీనిపై బాధ్యత వహించి నీట్ పరీక్ష ఫలితాలని వెంటనే రద్దు చేసి అధేవిధంగా అడ్మిషన్లు తెరవక ముందే మళ్లి నీట్ పరీక్షను నిర్వహించి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని ఎన్ ఎస్ యు ఐ నాయకులు నవీన్ డిమాండ్ చేసారు.
అదే విధంగా ఎన్ టి ఎ విడుదల చేసిన ఫలితాలు మరియు పేపర్ లీకేజీ మీద దాదాపు 9 పిటిషన్లు ధాకలు అయినప్పటికి సుప్రీం కోర్టు వారు ఇచ్చిన తీర్పును ఖండ్డిస్తు, నీట్ పలితాల పట్ల ప్రజల్లో వున్న వ్యతిరేఖతని కేంద్ర ప్రభుత్వం మరియు సుప్రీం కోర్టు కు సాటి చెప్పడానికి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది.
ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం స్పందించక పోతే మెడికల్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఎన్ ఎస్ యు ఐ అండగా నిలిచి రేపటి రోజున పెద్ద యెత్తున ఆందోళన కార్యక్రమాలకి శ్రీకారం చూడతాం అని ఎన్ ఎస్ యు ఐ నాయుకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రదాన కార్యదర్శి నవీన్‌కుమార్ మరియు జిల్లా నాయకులు సాకే ఉపేంద్ర, విష్ణు, నంద కుమార్,ఓబుల్రాజు, బరుగుడ్ల సిరిదీప్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.