కామారెడ్డి రక్తదాతలు దేశానికే ఆదర్శం..
ఉత్తమ రక్తదాతలకు అవార్డులను అందజేసిన కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందూప్రియా రెడ్డి…
నారద వర్తమాన సమాచారం
కామరెడ్డి జిల్లా ప్రతినిధి: జూన్ 15,
ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్కే డిగ్రీ పీజీ కళాశాల వారి సహకారంతో అత్యధిక సార్లు రక్తదానం చేసిన రక్తదాతలకు కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ (ఐవిఎఫ్),ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందూ ప్రియారెడ్డి మాట్లాడుతూ 2007లో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేసి 17 సంవత్సరాలుగా ఆపదలో ఉన్నవారికి రక్తదానం,తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్న డాక్టర్ బాలు ను అభినందించడం జరిగింది,అత్యధిక సార్లు రక్తదానం చేసిన రక్తదాతలు నిజమైన సమాజసేవకులని వారి సేవలు వెలకట్టలేనివవి అన్నారు. 2306 యూనిట్ల రక్తాన్ని సంవత్సర కాలంలో సేకరించి ఇండియా బుక్ రికార్డును నమోదు కావడం కామారెడ్డి జిల్లాకే గర్వకారణం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్కే విద్యాసంస్థల సీఈవో జైపాల్ రెడ్డి,రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్న,కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్, ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు,జమీల్,డాక్టర్ పుట్ల అనిల్,ఎర్రము చంద్రశేఖర్,వెంకటరమణ,శ్రీకాంత్ రెడ్డి,మోతే రాజిరెడ్డి,అంజల్ రెడ్డి,కౌన్సిలర్ సుగుణమ్మ,రక్తదాతలు పాల్గొనడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.