నారద వర్తమాన సమాచారం
రైతాంగానికి ఇచ్చిన మాట నిలబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే: ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
: భూదాన్ పోచంపల్లి,
ప్రతినిధి:
రైతాంగానికి ఇచ్చిన మాట నిలబెట్టేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.
పురపాలక కేంద్రంలో నేతాజీ చౌరస్తా వద్ద శనివారం మండల, పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ కోసం ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై నాయకులతో కలిసి పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ నాడు 2004లో ప్రభుత్వంలోకి వచ్చిన రోజే రైతన్న రుణమాఫీ పై సంతకం చేసి రైతు పక్షాన ఇప్పటికీ నిలిచేది రాజశేఖర్ రెడ్డికాంగ్రెస్ ప్రభుత్వమేనని చేసి చూపించిదని మరోసారి తిరగరాస్తుంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా రుణమాఫీ అమలు చేయాలని లక్ష్యంతో నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించడం చాలా గొప్ప విషయం ఆయన అన్నారు. రైతులందరికీ సుమారు 32 వేల కోట్ల రూపాయల రుణమాఫీ అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో రైతులను రుణమాఫీ ఇస్తానని చెప్పి మోసగించడం తప్ప అమలు చేసింది లేదని ఆయన విమర్శించారు. ఎన్ని కష్టాలకు ఓర్చుకోనైన ఇచ్చిన మాటలు నిలబెట్టడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుందని ఇప్పటికే ఇచ్చిన హామీలు సగానికి పైగా అమలు చేస్తూ రానున్న రోజుల్లో అన్ని గ్యారెంటీలను అమలు చేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తడక వెంకటేష్, మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్, డిసిసి ఉపాధ్యక్షులు సామ మధుసూదన్ రెడ్డి, కళ్లెం రాఘవరెడ్డి, పట్టణ అధ్యక్షుడు భారత లవ కుమార్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన జిల్లా నాయకులు గునీగంటి రమేష్ గౌడ్, కౌన్సిలర్లు భోగ భానుమతి విష్ణు, మోటే రజిత రాజు, మండల ఉపాధ్యక్షులు కాసుల అంజయ్య, మండల పట్టణ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్, బండారు ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సీత సుధాకర్, మండల నాయకులు పకీరు మల్లారెడ్డి, గోరంటి శ్రీనివాస్ రెడ్డి, మలిపెద్ది అంబరీష్ రెడ్డి, కొట్టం కరుణాకర్ రెడ్డి, ఫకీరు నర్సి రెడ్డి, బాల మల్లేష్ యాదవ్, యువజన కాంగ్రెస్ నాయకులు కుమార్, సంజు, చంద్రప్రకాష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.