మద్ధిమడుగు పీఠాధిపతి శ్రీ శ్రీ జయరాం గురుస్వామి ఆశ్రమం.స్వాముల సౌకర్యార్థం మద్దిమడుగు లో సేవాశ్రమం .
, భక్తుల సహాయ సహకారాల తో ఆశ్రమ నిర్మాణం .అచ్చంపేట:– ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని పదర మండలములో మధ్ధిమడుగు శ్రీ శ్రీ ఆంజనేయస్వామి అంటె తెలియని వారుండ రేమో, పిలిస్తే పలికే దైవం గా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది, స్వామి వారు పబ్భతి ఆంజనేయ స్వామి గా ప్రసిద్ధి చెందుతూ ఉన్నారు, ఈ క్షేత్రం పూర్వం బ్రహ్మ నాయుని ఆధ్వర్యంలో ప్రతిష్టి oప బడినదని నానుడి, 1992వ సంవత్సర ములో జయరాం గురుస్వామి కి శ్రీస్వామి వారు స్వప్నంలో సాక్షాత్కరించి నా యొక్క మాలధారణ నిర్వహించాలి అని స్వప్నంలో చెప్పి అంతర్ధాన మయ్యాడని అదే 1992సంవత్సరంలో స్వామి వారి కి ఇష్టమైన కార్తీక మాసంలో మొట్టమొదటి సారిగా కేవలం పన్నెండు మంది తన స్నేహితులతో కలిసి శ్రీ శ్రీ మద్దీమడుగు ఆంజనేయ స్వామి మాలధారణ జరిపించాడు, అది మొదలు నాటినుండి నేటివరకు మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండీ కూడా స్వామి వారి దీక్షను ప్రారంభించారు మన జయరాం గురుస్వామి, ఆలోచనా ప్రకా రంగా స్వామి వారీ దీక్షా పీఠాన్ని స్థాపించాలని కోరిక మేరకు హైదరాబాద్ లోని తు ర్క ఎంజాల్ లక్ష్మినగర్ వద్ధ తన స్వంత ఖర్చులతో మరియు ప్రభుత్వం నుండీ సహాయ సహకారాలు తీసుకొని చక్కనైన దేవాలయాన్ని నిర్మించి ప్రతీ రోజూ పూజాది కార్యక్రమాలు నేటికీ కూడ నిర్వహిస్తున్నారు, మనహిందూ మతాన్ని వదలిన ఎంతో మందిని ప్రభావితం చేసి తిరిగి హిందూ మతంలోకి మారడానికి కారణం అయ్యాడు, అదేవిధంగా స్వామి వారి సంకల్పంలో భాగంగా మధ్ధి మడుగు గ్రామంలో శ్రీ శ్రీ మధ్ధి మడుగు ఆంజనేయ స్వామి దీక్ష పీఠాన్ని నిర్మించాలని తలంపుతో సుమారుగా రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి అక్కడ ఆశ్రమం మరియు స్వామి వారి పీఠాన్ని నిర్మించాలని తలంపుతో సుమారుగా మూడు నెలలు శ్రమించి కొంత మంది భక్తులు ఆర్థిక సాయం అందించారు ,వెనుకంజ వేయకుండా అన్నింటికీ ఆంజనేయ స్వామి ఉన్నాడని ధైర్యంతో ముందున్నాడు మన జయరాం గురుస్వామి, ఈ దీక్షా పరంగా తన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడ వదులు కోవడం విశేషంగా చెప్పుకోవచ్చు,కార్తీక మాసమే కాకుండా హనుమత్ జయంతి కి కూడ స్వామి వారి దీక్షలనునిర్వహిస్తున్నారు, వీరి ద్వారా ఎంతో మంది భక్తులు దీక్షను స్వీకరిస్తూ ప్రతి సంవత్సరం కూడ ఎక్కువమంది దీక్షను స్వీకరిస్తూ ఉన్నారు, పిలిస్తే పలికే దైవం గా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో జయరాం గురుస్వామి అందరి కొరకు అహర్నిశలు పాటుపడి ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న స్వామివారికి మనవంతుగా ఉడతా భక్తిగా సహాయ సహకారాలు అందించాలని భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు,
Discover more from
Subscribe to get the latest posts sent to your email.