Saturday, August 8, 2026
spot_img

విశ్వబ్రాహ్మణుల జోలికొస్తే ప్రతిదాడులు చేస్తాం..

నారద వర్తమాన సమాచారం

విశ్వబ్రాహ్మణుల జోలికొస్తే ప్రతిదాడులు చేస్తాం..

సిరిసిల్లకు చెందిన విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుడిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ జనరల్ బజార్ ప్రాంతంలో సిరిసిల్లకు చెందిన విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుడు ధర్మవరం శ్రీనివాస్ చారిపై జరిగినట్లు వెల్లడైన దాడి ఘటనను విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ (VKC), తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం తీవ్రంగా ఖండిస్తోంది.

శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో, కవాడిగూడ ప్రాంతంలో కామాక్షి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న భవనంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం అందింది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ధర్మవరం శ్రీనివాస్ చారి (సిరిసిల్ల వాసి) ప్రస్తుతం ICUలో చికిత్స పొందుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన కుమారుడు ధర్మవరం భాను ప్రకాష్ కుటుంబ సభ్యులతో కలిసి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

విశ్వకర్మ స్వర్ణకారులు తమ వృత్తి నిర్వహణలో ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా ఉండేలా ప్రభుత్వం, పోలీస్ శాఖ తగిన రక్షణ చర్యలు చేపట్టాలని విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ డిమాండ్ చేస్తోంది.

మా డిమాండ్లు

  • ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి.
  • బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.
  • బాధితుడు ధర్మవరం శ్రీనివాస్ చారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలి.
  • బాధిత కుటుంబానికి అవసరమైన ప్రభుత్వ సహాయం, రక్షణ కల్పించాలి.
  • స్వర్ణకారులు మరియు ఇతర వృత్తి కార్మికుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

విశ్వకర్మ సమాజానికి చెందిన ప్రతి వృత్తి కార్మికుడి భద్రత, గౌరవం కోసం విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.

విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ (VKC)
తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం

మునిగంటి త్రినాధ్ చారి
President – Telangana State Youth Wing
Vishwakarma Knowledge Centre (VKC)


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version