Friday, November 22, 2024

పల్నాడు జిల్లా, కారెంపూడి మండలం, ఒప్పిచర్ల గ్రామంలో ఒంటరి మహిళ పై అత్యాచారం, హత్య మరియు దొంగతనం కేసు ను చేధించిన పల్పాడు జిల్లా పోలీసులు

నారద వర్తమాన సమాచారం

పల్నాడు జిల్లా, కారెంపూడి మండలం, ఒప్పిచర్ల గ్రామంలో ఒంటరి మహిళ పై అత్యాచారం, హత్య మరియు దొంగతనం కేసు ను చేధించిన పల్పాడు జిల్లా పోలీసులు

గుంటూరు రేంజ్ ఐ.జీ సర్వశ్రేష్ట త్రిపాటి ఐపిఎస్ మరియు పల్నాడు జిల్లా ఎస్పీ మల్లీక గర్గ్ ఐ పి ఎస్ మార్గదర్శకత్వంలో సంక్లిష్ట మైన కేసును చేధించిన పల్నాడు జిల్లా పోలీసులు.

కేసును చేధించేందుకు కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించిన గుంటూరు రేంజ్ ఐ.జీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఐ పిఎస్ మరియు జిల్లా ఎస్పీ మల్లీక గర్గ్ ఐ పి ఎస్

పల్నాడు జిల్లా ఎస్పీ మల్లీక గర్గ్ ఐ పి ఎస్ స్వీయ పర్యవేక్షణలో అడిష్నల్ ఎస్ పి (క్రైమ్) సి హెచ్ లక్ష్మీపతి మరియు గురజాల డి ఎస్ పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఒంటరి మహిళ అత్యాచారం, హత్య మరియు దోపిడీ కేసు కు పాల్పడి తప్పించుకొని తిరుగుతున్న నేరస్థులు అరెస్టు చేసిన పల్నాడు జిల్లా పోలీసులు.

చేదించిన కేసు వివరములు:

నేరం జరిగిన తేదీ మరియు సమయం : 26.06.2024 రాత్రి సమయంలో.

నేరం జరిగిన ప్రదేశము: ఒప్పచెర్ల గ్రామంలో మృతురాలి నివాస గృహంలో.

నేర సంఖ్య & చట్టం సెక్షన్: 80/2024 యు /ఎస్ 302, కారెంపూడి పోలీస్ స్టేషన్ యొక్క 380 ఆర్ /డబ్య్లూ 34 ఐ పి సి

మృతురాలి వివరాలు: ఒప్పచెర్ల గ్రామ నివాసి.

ముద్దాయిలు పేర్లు:

1. రమావత్ బాబు నాయక్ సన్నాఫ్ /సక్రియ నాయక్, 35 సం. సి /లంబాడీ, కారంపూడి

తండా, కారంపూడి (అరెస్ట్ చేసినారు)

2. బాణావత్ బాలు నాయక్ సన్నాఫ్ /బద్యా నాయక్, 35సం.సి / లంబాడీ, మసీదు బజార్, కారంపూడి (అరెస్ట్ చేసినారు)

రికవరీ చేసిన సొత్తు:

1. హెచ్ ఎఫ్ డీలక్స్ బైక్-1 (ఎ పి O7డి టి 5612)

2. మృతురాలి చెవి కమ్మలు.
ముద్దాయిలు నేరం చేసిన విధానము:

మృతురాలు తను నివాసం ఉండే ఇంట్లోనే చిన్న కిరాణా షాపు పెట్టుకొని అప్పుడప్పుడు అక్రమంగా మద్యం విక్రయిస్తూ భర్తతో ఉన్న గొడవల నేపథ్యంలో ఒంటరిగా జీవిస్తూ ఉన్నది. అక్రమంగా మద్యం అమ్మిన కారణంగా గతంలో ఆమెపై కారెంపూడి పోలీసు వారు కేసు కూడా నమోదు చేయటం అయినది. మృతురాలికి ఉన్న మరొక ఇంటిని మొదటి ముద్దాయి అయిన బాబు నాయక్ కి అద్దెకు ఇవ్వటం జరిగింది. ఈ క్రమంలో ఆమె వద్ద అప్పుడప్పుడు మందు తాగడానికి వెళ్తూ ఉంటాడు 26.06.2024వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో బాబు నాయక్ మరియు అతనికి బంధువు అయినటువంటి బాలు నాయక్ లు ఇద్దరు మృతిరాలి వద్దకు మందు తాగడానికి వెళ్ళిన సమయంలో ఆమె డబ్బులు లేనిది మందు ఇవ్వనని అనడంతో మృతిరాలికి మరియు ముద్దాయిలకు గొడవ జరిగినది. జరిగిన గొడవని మనసులో పెట్టుకున్న ముద్దాయిలు ఆమెను తలపై పప్పుగుత్తి తో కొట్టి, వెనుక గదిలోకి తీసుకుని వెళ్లి, అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై అవకాసం చూసుకొని ఇరువురూ అత్యాచారం చేసి ఆమె చెవులకు ఉన్న కమ్మలను బలవంతంగా తీసుకొని, షాపులో ఉన్న కొంత డబ్బుని దొంగతనం చేసుకొని వెళ్ళినారు.

ఛేదించిన కేసు జరిగిన విధానం:

ఈ కేసులో ముద్దాయిలను గుర్తించుట మరియు పట్టుకొనుటకు పల్నాడు ఎస్పీ పర్యవేక్షణలో 5 టీములను ఏర్పాటు చేసి, క్లూస్ టీం ను. డాగ్ స్క్వాడ్ నిదిన్ రంగంలోకి దించటం జరిగింది, తరువాత సి సి టీ వి అనాలసిస్, కాల్ డాటా ఎనాలసిస్ మరియు లోకల్ గా మృతురాలి వద్దకు వచ్చి మందు తాగే వాళ్ళ డీటెయిల్స్ మరియు లోకల్ ఏరియా నందుగల చెడు ప్రవర్తన కలిగిన వారిని మరియు ఆమెని చివరిగా ఎవరు కలిశారు అనే కోణంలో దర్యాప్తు చేసి ముద్దాయిలను గుర్తించి వారిరువురిని పట్టుకోవడం జరిగింది. ఇరువురూ నేరం చేసినట్లు అంగీకరించినారు.

ఈ కేసును ఎంతో ప్రతిష్టత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిష్నల్ ఎస్పి (క్లైమ్) లక్ష్మీపతి మరియు గురజాల డి ఎస్ పి సి హెచ్ . శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సమర్ధవంతమైన మరియు నేరాల కనుకోనుటలో నైపుణ్యం వున్న అధికారులు మరియు సిబ్బందితో ఐదు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటుచేసి, నేరం జరిగిన తీరుని బట్టి లోతైన దర్యాప్తునకు తగిన మార్గదర్శకాలు, సలహాలు, సూచనలు జారీ చేస్తూ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ నేర పద్ధతులు మరియు గతంలో జిల్లాలో జరిగిన ఈ తరహా నేరాలకు పాల్పడిన
నేరస్తుల నేర విధానం గురించి అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరిపించి, చుట్టుపక్కల చెడునడత కలిగిన వారి మీద ప్రత్యేక దృష్టి సారించి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ముద్దాయిలను చాకచక్యంగా కారంపూడి ఇన్ స్పెక్టర్ ఏ . శ్రీనివాస్ మరియు వారి సిబ్బందితో తేదీ: 28.06.2024 న కారంపూడి వినుకొండ రోడ్డులోని ఎన్ ఎస్ పి కాలువ వద్ద అరెస్ట్ చేయటం జరిగింది.

అభినందనలు: ఈ కేసుల నిందితులను పట్టుకోనుటలో ప్రతిభ కనపరిచి, అత్యంత నైపుణ్యత ప్రదర్శించి నేరం జరిగిన 24 గంటలలోనే ముద్దాయిలను పట్టుకొన్న అధికారులు మరియు సిబ్బందిని పల్నాడు ఎస్పీ మల్లీకా గర్గ్ ఐ పి ఎస్ ప్రశంసా పత్రాలతో సత్కరించటం జరిగింది.

అధికారులు మరియు సిబ్బంది వివరాలు:

1. సి హెచ్ శ్రీనివాస రావు, డి ఎస్పీ గురజాల,

2. అలహరి శ్రీనివాస రావు, సి ఐ కారెంపూడి సర్కిల్,

3. కె .అమీర్, ఎస్ ఐ కారెంపూడి పి ఎస్

4. పి వి . సుబ్బారావు, హెచ్ సి కారెంపూడి పి ఎస్

5. కె.వెంకట్రావు, పి సి కారెంపూడి పి ఎస్

6. కె .పోతురాజు, పి సి కారెంపూడి పి ఎస్

7. కె సి హెచ్ నరసింహారావు, పి సి , కారెంపూడి పి ఎస్

8. టి.దుర్గా కల్యాణి, డబ్య్లూ పి సి కారెంపూడి పి ఎస్

గమనిక: ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలలు / యువతిలపై అఘాయిత్యాలు. లైంగిక దాడులు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, మహిళలపై వేధింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో చట్టం నుండి తప్పించుకునే వీలులేకుండా కోర్ట్ లో సమర్థవంతమైన ట్రయిల్ మానిటరింగ్ ద్వారా నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా కృషి చేస్తున్నామన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version