నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్….
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిస్కరవేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఐపీఎస్ .”
ఈ ప్రజా సమస్యల పరిస్కరవేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, వ్యవసాయ పనిముట్లు ఇప్పిస్తానని మోసాలు, కోడలి మీద మామ లైంగిక వేదింపులు, మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు అందాయి. గోనెపూడి గ్రామం, నరసరావు పేట మండలానికి చెందిన కొంత మంది రైతులు దగ్గర నుండి వ్యవసా పని ముట్లు ఇప్పిస్తానని గొనపూడి గ్రామ సచివాలయం లో అగ్రి కల్చర్ అసిస్టెంట్ పని చేస్తున్న పగడాల అనిల్ కుమార్ సుమారు 67లక్షలరూపాయిలమోసంచేసినట్లుపిర్యాదిచేసినారు.
బొల్లాపల్లి మండలం లాలుపురం గ్రామానికి చెందిన కేతావత్ హారిక ఛాయ్ ని చక్రపాలెం చెందిన మోహన్ నాయక్ ఇచ్చి పెళ్లి చేయగా హారిక బాయిని వాళ్ల మామ అయిన కేతవత్ కొండ నాయక్ (టిచ్చర్) లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు ఇవ్వడమైనది.
ఎడ్లపాడు మండలం. కారు చోళ గ్రామానికి చెందిన మద్దూరి పాలు తండ్రి సుందరావు ను సదరు గ్రామానికి చెందిన చర్చ్ డబ్బులు విషయంలో గొడవ జరిగి మద్దూరి పాలు ను కొట్టినట్లు ఫిర్యాదు..
పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామానికి చెందిన వీరపల్లి నాగ కన్యకమ్మ భర్త వెంకటప్ప రెడ్డి కి చెందిన పొలానికి గెట్ హద్దులు తీసివేసిన అన్నపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి నాగిరెడ్డి ఇద్దరు సదరు పొలమును వాళ్ళ పొలంలో కలుపుకోవాలని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదు.
ప్రజా సమస్యల పరిస్కరవేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి పీర్యాదులను రాసిపెట్టడంలో పోలీస్ సిబ్బంది. సహాయసహకారాలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో అదనపు ఎస్పీ (క్రైమ్
), ఆరైలు, ఎస్ బి సీఐలు, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.